విశాఖ మద్దిలపాలెం బస్సు డిపోలో పార్క్ చేసిన బస్సు రాత్రికి రాత్రే అపహరణకు గురైంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి డీజిల్ నిండుగా కొట్టి ఉంచిన బస్సుతో పరారయ్యాడు. బస్సులోని డీజిల్‌ను అమ్మి.. ఆ డబ్బుతో మద్యం తాగడానికి ప్లాన్ వేశాడు. ఈ నెల 17వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సు ఓనర్ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సును అపహారించిన ఈగల పైడి రాజును ఈ నెల 19న అదుపులోకి తీసుకొని బస్సును రికవరీ చేశారు.
Also Read: Ravi Teja Horror Movie: రవితేజ సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్.. థియేటర్లలో బ్లాస్ట్ పక్కా!
జనవరి 17వ తేదీన బస్సు చోరికి గురైనట్లు హైర్ బస్సు ఓనర్‌కు డ్రైవర్ అప్పారావు సమాచారం ఇచ్చాడు. ఎంవీపీ పోలీసులకు ఓనర్ నాయుడు ఫిర్యాదు ఇచ్చాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి బస్సు లంకెలపాలెం వైపు వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బస్సు అపహరించింది తన దగ్గర పనిచేసే మరో డ్రైవర్ పైడి రాజుగా బస్సు ఓనర్ అనుమానించారు. ఈనెల 19వ తేదీన రామా టాకీస్ వద్ద పైడి రాజును పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో ఓ ట్విస్ట్ వెలుగు చూసింది. డీజిల్ అమ్మగా వచ్చిన డబ్బులతో మద్యం కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో బస్సు అపహరించానని పైడి రాజు ఒప్పుకున్నాడు. బస్సు రికవరీ చేసి ఓనర్‌కు అప్పగించారు. పైడి రాజు గతంలో కూడా ఇటువంటి చోరికి పాల్పడినప్పటికీ.. అప్పుడు దొరక్కుండా, ఇప్పుడు పట్టుబడ్డాడు.
