Site icon NTV Telugu

Vivo V25 Pro: భారత్‌లో ఈ నెల 17న లాంచ్ కానున్న వివో వీ25 ప్రో.. అదిరే ఫీచర్లతో..

Vivo V25 Pro

Vivo V25 Pro

Vivo V25 Pro: భారతదేశంలో వివో V25 ప్రో లాంచ్ ఆగస్ట్ 17న లాంచ్ చేయనున్నట్లు ఆ కంపెనీ ధ్రువీకరించింది. స్మార్ట్‌ఫోన్ రంగు మారుతున్న బ్యాక్ ప్యానెల్‌తో రానుంది. ఇది వివో వీ25 సిరీస్‌లో భాగంగా వస్తోంది. ఈ సిరీస్‌లో ”వివో వీ25ఈ” కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో రావచ్చని వార్తలు వచ్చాయి. స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ఈ ఫోన్ రానుంది.

No Helmet No Petrol : వాహనదారులకు షాక్‌.. ఆగస్టు 15 నుంచి వారికి పెట్రోల్‌ బంద్‌

వివో వీ25 ప్రో భారతదేశంలో ఆగస్టు 17 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని వివో ప్రకటించింది. ఫోన్ రంగు మార్చే బ్యాక్ ప్యానెల్, 3డీ కర్వ్‌డ్ స్క్రీన్‌ను కలిగి ఉందని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoC ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేయనుంది. 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 66వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు 4,830ఎంఏహెచ్ సామర్థ్యం గలం బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్.. వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌తో పూర్తి హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రావచ్చని ఇప్పటికే తెలిసింది. ఇది భారతదేశంలో ప్రారంభించినప్పుడు ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంటుంది. దీని ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు.

Exit mobile version