NTV Telugu Site icon

Viswak Sen : మోక్షజ్ఞ వారి వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు..

Mokshagna

Mokshagna

Viswak Sen : నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల వారసులు సినీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు.దీనితో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య ఎప్పటికప్పుడు త్వరలో ఉంటుంది అని చెబుతూనే వున్నారు.అయితే ఎప్పుడు ఉంటుందో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.అయితే కొడుకు సినీ ఎంట్రీ పై బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.మోక్షజ్ఞ మొదటి సినిమా భాద్యతను ఒక స్టార్ డైరెక్టర్ కు అప్పగించినట్లు సమాచారం.అయితే తనకు వరుస సూపర్ హిట్స్అందించిన బోయపాటి డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ఈ విషయంపై ఎలాంటి ఇన్ఫో లేదు.దీనితో మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్ట్ చేసే ఆ దర్శకుడు ఎవరా అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

Read Also :Balakrishna : బాలయ్య మందు సీసా వివాదం.. స్పందించిన నిర్మాత నాగ వంశీ..

అయితే తాజాగా బాలయ్య మాస్ కి దాస్ విశ్వక్ సేన్ నటించిన ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయ్యారు.అయితే ఆ ఈవెంట్ లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.మోక్షజ్ఞను నన్ను,నాన్న గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దని చెప్పాను.ఇప్పుడు నటిస్తున్న యంగ్ హీరోలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించినట్లు బాలయ్య తెలిపారు.అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందని కథ చర్చలు జరుగుతున్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మోక్షజ్ఞ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేసారు.మోక్షజ్ఞ వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడని తెలిపారు.దీనిని బట్టి మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Show comments