Laila : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన ప్రతీ సినిమాతో ఏదొక యునిక్ పాయింట్ తో అలరించే ప్రయత్నం తాను చేస్తుంటాడు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చెయట్లేదు అనే చెప్పాలి. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలను రిలీజ్ చేశాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళుతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల మరో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమా ప్రకటించాడు విశ్వక్.
Read Also:Talasani Srinivas: రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించాం..
ఈ సినిమా విశ్వక్ మొదటిసారి లేడీ గెట్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాను చాలా రోజుల కిందట అనౌన్స్ చేసాడు. మెకానిక్ రాకీ రిలీజ్ కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ సినిమా అయిపోవడంతో లైలా సినిమా పై దృష్టిపెట్టాడు. లైలా సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కూడా కనిపించనున్నాడు. దీనితో ఈ పాయింట్ పై మంచి బజ్ ఉంది.
Read Also:NTR Trust Musical Night: ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమన్ మ్యూజికల్ నైట్
ఇక రీసెంట్ గానే వచ్చిన టీజర్ కూడా అలరించగా ఇపుడు సినిమా రెండో సాంగ్ కి డేట్ ఫిక్స్ చేసేశారు మేకర్స్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఆకాంక్ష శర్మ నటిస్తుండగా తనతో కలిపి ఒక హాట్ రొమాంటిక్ సాంగ్ ని ఈ జనవరి 23న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగే ఈ సాంగ్ లో హీరోయిన్ మంచి హాట్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే “సోను మోడల్” అనే పాటను విడుదల చేసింది. ఈ పాటకు విశ్వక్ సేన్ స్వయంగా లిరిక్స్ అందించడం విశేషం. నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఈ పాటను ఆలపించారు.