Site icon NTV Telugu

Family Dhamaka: ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సరికొత్త ముఖ చిత్రంగా యువ హీరో.. వీక్షకులకు పండగే పండగ!

Vishwak Sen

Vishwak Sen

Tollywood Hero Vishwak Sen’s Family Dhamaka Show Streaming on Aha: ఇప్పటివరకు హీరోగా, దర్శకుడిగా అలరించిన టాలీవుడ్ యువ కథానాయకుడు ‘విశ్వక్ సేన్’.. తాజాగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. విలక్షణ నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యువ హీరో హోస్ట్‌గా మారారు. ‘ఫ్యామిలీ ధమాకా’ షోకు విశ్వక్ సేన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలలో తన కామెడీతో అలరించిన విశ్వక్.. షోలో అంతకుమించి హాస్యం పండిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సరికొత్త ముఖ చిత్రంగా ఆయన మారారు.

‘ఫ్యామిలీ ధమాకా’ కేవలం షో మాత్రమే కాదు.. కుటుంబాల మధ్య జరిగే ఓ పండుగ వాతావరణం లాంటిది. ఓ వైపు మన బుర్రకు పదును పెడుతూనే.. మరోవైపు తిరుగులేని వినోదాన్ని అందిస్తుంది. ఈ ఫ్యామిలీ ధమాకాకు విశ్వక్ సేన్ హోస్ట్‌గా వ్యవహరించటం వల్ల సరికొత్త ఛరిష్మాను తీసుకొచ్చారు. విశ్వక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. అలాంటి విశ్వక్.. ఫ్యామిలీ ధమాకాను హోస్ట్ చేయటం వీక్షకులకు ఓ నవ్వుల ప్రయాణంలా మారింది.

ఓటీటీలో హోస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విశ్వక్ సేన్‌కు ఇదొక కీలక ప్రారంభమనే చెప్పాలి. సహజ ప్రతిభతో రోజురోజుకీ తన విస్తృతిని పెంచుకుంటూ వెళుతున్నారు. విశ్వక్ బుల్లితెర ఆడియెన్స్‌ను కూడా అలరిస్తారనే దానికి ‘ఆహా’ ఎంత నమ్మకంగా ఉందో చెప్పటానికి ఇదొక నిదర్శనం. ఇప్పటికే తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న ఆహా.. ఇప్పుడు ‘ఫ్యామిలీ ధమాకా’లో సరికొత్త సవాళ్లను అందించనుంది.

Also Read: Colombo Weather: రిజర్వ్‌ డే రోజు కూడా వర్షం పడితే.. భారత్‌కు కష్టాలు తప్పవు!

ఎంతో ఉల్లాసంగా, భావోద్వేగాల కలయికగా ఓ రోలర్ కోస్టర్‌లా ‘ఫ్యామిలీ ధమాకా’ షో ఆకట్టుకోనుంది. ఇలాంటి షోలో విశ్వక్ సేన్ అడుగుపెట్టడమనేది ఎంటర్‌టైన్‌మెంట్‌కి మరింత ఊపునిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆహాలో ఫ్యామిలీ ధమాకా షో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి విశ్వక్ సేన్ సరికొత్త అర్థాన్ని చెప్పబోతున్నారు. తెలుగు కుటుంబాలు విశ్వక్ సరికొత్త ధమాకాను చూసి పండగ చేసుకోవడం పక్కా.

Exit mobile version