NTV Telugu Site icon

Ori Devuda: క్లాసీ ఎలిమెంట్స్‎తో విశ్వక్ సేన్ కామెడీ.. ‘ఓరి దేవుడా’ ట్విట్టర్ రివ్యూ

Ori Devuda

Ori Devuda

Ori Devuda: విభిన్న కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు హీరో విశ్వక్ సేన్. తాజాగా క్లాస్ ఏలిమెంట్స్ తో.. డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకుని ఓరీ దేవుడా సినిమా చేశాడు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. విక్టరీ వెంకటేష్ చిత్రంలో దేవుడిగా కనిపించారు. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ తెరకెక్కించారు. సినిమాను దీపావ‌ళి కానుకగా నేడు (అక్టోబ‌ర్ 21) విడుద‌లైంది.

Read Also: Ginna Twitter Review: మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ.. ట్విట్టర్ రివ్యూ

యూత్ కు కనెక్ట్ అయ్యే కథాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ సేన్.. ఫలక్ నామ దాస్, హిట్, పాఘల్, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడు పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ చేస్తుండటం విశేషం. స్టైలిష్ లాయర్‌గా వెంకటేష్ కీలకమైన పాత్రలో కనిపించారు.

అర్జున్ దుర్గరాజు (విశ్వక్ సేన్), అను పాల్‌రాజ్ (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. కానీ, పెళ్లి తర్వాత కొన్నాళ్లకే అపార్థాలతో వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే.. అయితే విడిపోవాలని అనుకున్న వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది. వీరిద్దరి సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడు? అనే నేపథ్యంలో సాగిన వినోదాత్మ చిత్రమే ‘ఓరి దేవుడా’.

Read Also: Allu Aravind: ఆయన తిడతాడేమోనని ముందే చూపించాను : అల్లు అరవింద్

ఓరిదేవుడా ఫస్టాఫ్ ఫన్ రైడ్‌తో వినోదాత్మకంగా సాగిందని.. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచిందని యూఎస్ ప్రేక్షకులు అంటున్నారు. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ అతిథి పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేశారని అంటున్నారు. వినోదానికి ఫాంటసీ మిక్స్ చేసి ‘ఓరి దేవుడా’ ఫన్ రైడ్‌గా సాగిందని అంటున్నారు. అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ పీఆర్ఓ వంశీ కాకా సహ నిర్మాతగా వ్యవహరించడంతో ట్విట్టర్‌లో సెలబ్రిటీలు ట్వీట్‌లతో మోత మోగిస్తున్నారు. ‘ఓరి దేవుడా’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.