NTV Telugu Site icon

Vishal: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. పార్టీ పేరు అనౌన్స్ చేసేది అప్పుడే?

Vishaall

Vishaall

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు కాస్త ఆసక్తిగానే ఉంటాయి.. ప్రముఖ స్టార్ హీరోలు అందరూ కొత్త పార్టీ పెడుతున్నారు.. నిన్న విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు.. ఇప్పుడు అదే దారిలో మరో స్టార్ హీరోయిన్ వెళుతున్నాడు..త్వరలోనే కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..

ఎంజీఆర్, విజయ్ కాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవలే తమిళ నటుడు విజయ్ కూడా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇపుడు మరో నటుడు విజయ్ ని ఫాలో అవుతున్నారు. నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.. కొత్త పార్టీకి గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం..

ఇప్పటివరకు రాజకీయాల్లోకి వచ్చిన సినీ ప్రముఖులను ప్రజలు ఆదరించారు.. విశాల్ కు కూడా తమిళనాట మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే తమిళన చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వీటి కేంద్రంగా కొన్ని వివాదాలు తలెత్తినా ఓ వర్గం నుంచి ఆదరణ పొందారు. ఇక జయలలిత మరణం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. జయలలిత సిట్టింగ్ స్థానమైన ఆర్.కే నగర్ నుంచి నామిమేషన్ వేశారు.. అయితే దాన్ని తిరష్కరించారు.. ఇప్పుడు నేరుగా కొత్త పార్టీని పెడుతున్నాడు..