Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- విశాఖపట్నంలో విషాదకర ఘటన
- చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి
- వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెవి నొప్పి సమస్యతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన 13 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఆనందపురం ప్రాంతానికి చెందిన యజ్ఞశ్రీ (13) అనే బాలిక చెవి నొప్పి సమస్యతో విశాఖలోని ఆయుష్మాన్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరింది. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో కొన్ని మందులు ఇచ్చారు. అయితే ఆపరేషన్‌కు ముందు వైద్యులు ఓవర్ డోస్ మందులు ఇవ్వడం వల్లే బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. మందులు ఇచ్చిన అనంతరం యజ్ఞశ్రీ హార్ట్ బీట్ బాగా పెరిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్‌పై వేటు!
బాలిక మృతి చెందిన విషయాన్ని ఆయుష్మాన్ ఆస్పత్రి యాజమాన్యం కొంతసేపు దాచిపెట్టిందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే యజ్ఞశ్రీ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?