NTV Telugu Site icon

Virupaksha: విరూపాక్ష డైరెక్టర్ కి సర్పైజ్ ఇచ్చిన హీరో, నిర్మాత

Virupaksha

Virupaksha

Virupaksha: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. ఈ ఏడాది మొదట్లో రిలీజైన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వేసవి కానుకగా వచ్చిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం జనాలకు పిచ్చిగా నచ్చేసింది. దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన ఈ సాలిడ్ థ్రిల్లర్ చిత్రంతో ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

మరి లేటెస్ట్ గా విరూపాక్ష దర్శకుడు కార్తీక్ ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ అలాగే తన నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్ సహా భోగవల్లి బాపినీడు ఇచ్చిన మెర్సిడిస్ బెంజ్ కార్ గిఫ్ట్ ని షేర్ చేసి తనకు ఇలాంటి వండర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అని అలాగే దర్శకుడు సుకుమార్ గారికి రుణపడి ఉంటానని కార్తీక్ తెలిపి కొన్ని ఫోటోలు షేర్ పంచుకున్నాడు.