పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేదు. అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి వారం భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా పై విమర్శలు మాత్రం వస్తూనే వున్నాయి. సినిమా కు వస్తున్న నెగటివ్ టాక్ వలన బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తుంది..ఆదిపురుష్ సినిమా కు కలెక్షన్స్ కూడా తగ్గుతున్నాయి.ఈ సినిమా ను చూసిన కొంతమంది సెలెబ్రేటీస్ కూడా నెగటివ్ గానే స్పందించారు. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఆదిపురుష్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ సినిమా చూశాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది అంటూ కామెంట్లు చేయడం విశేషం. వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలి లో ఇచ్చిన ఈ రివ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ కు భారీగా లైక్స్ కూడా వస్తున్నాయి.. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ విషయంలో బాగా మండిపడుతున్నారు..
ప్రభాస్ సినిమాకు ఇలా నెగటివ్ గా స్పందించాల్సిన అవసరం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతున్నాయి.ఆదిపురుష్ మేకర్స్ ఆ ట్వీట్ పై స్పందిస్తారో లేదో చూడాలి. ఆదిపురుష్ సినిమా గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు కూడా భారీ స్థాయి లో నష్టాలను మిగిల్చాయి.తన తరువాత సినిమాలు అయిన సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు కచ్చితంగా విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయి లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.ఈ రెండు సినిమాల లో కూడా ప్రభాస్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
https://twitter.com/virendersehwag/status/1672830100742733825?s=20