NTV Telugu Site icon

Virat Kohli: కోహ్లీ ఔటా! నాటౌటా?.. చెత్త అంపైరింగ్‌పై నెటిజన్ల ట్రోల్స్

6

6

ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి కోహ్లీ మరోసారి బలైపోయాడు. దీంతో టీమిండియా అభిమానులు అంపైర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. భారత్‌ ఇన్నింగ్స్‌ 50 ఓవర్‌ వేసిన కునేమన్ బౌలింగ్‌లో కోహ్లీ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కోహ్లీ ప్యాడ్‌ను తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఆసీస్‌ ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్‌ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌ ఔట్‌ అని ప్రకటించాడు. వెంటనే, విరాట్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో ముందుగా బంతి బ్యాట్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంపైర్‌ నిర్ణయాన్ని స్క్రీన్‌పై చూసిన కోహ్లీ కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 44 పరుగులు చేశాడు. కాగా విరాట్‌ కోహ్లీ ఔట్‌ నిర్ణయంపై టీమిండియా మాజీ ఆటగాళ్లు అభినవ్‌ ముకుంద్‌, వసీం జాఫర్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. గతేడాది స్వదేశంలో శ్రీలంకపై కూడా విరాట్‌ ఇలానే పెవిలియన్‌కు చేరాడు. “ఢిల్లీ టెస్టులో కోహ్లీది నాటౌట్‌. బంతి ముందు బ్యాట్‌కు తాకింది. కోహ్లీ చాలా దురదృష్టవంతుడు. అతడి వికెట్‌తో భారత్‌ కష్టాల్లో పడింది” అని అభినవ్‌ ముకుంద్‌ ట్వీట్‌ చేశాడు. “అది ఔట్‌ కాదు. స్పష్టంగా బంతి బ్యాట్‌కు తాకింది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై చాలా సందేహాలు ఉన్నాయి” అని జాఫర్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఫ్యాన్స్‌ కూడా థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై మండిపడుతున్నారు. “చెత్త అంపైరింగ్‌.. కళ్లు కనిపించడం లేదా! అది నాటౌట్‌’’ అంటూ విరాట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Cheteshwar Pujara: వందో టెస్టులో పుజారా చెత్త రికార్డు.. రెండో బ్యాటర్‌గా!

Show comments