Site icon NTV Telugu

Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అత్యధిక హాఫ్‌ సెంచరీలు..

Virat Kohli Rcb

Virat Kohli Rcb

టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌(IPL)లో చరిత్ర సృష్టించాడు. ఇవాళ 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘతన సాధించాడు.

READ MORE: Health Tips: ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి!

విరాట్‌ కోహ్లీ 43 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 74 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కోహ్లీకిది 59వ అర్ధశతకం. దీంతో పాటు 8 సెంచరీలు కూడా ఉన్నాయి. 50+ స్కోర్లు మొత్తం కలిపి 67 నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికంగా అర్ధ శతకాలు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ పేరు మీద ఉన్న రికార్డును బద్దలు గొట్టాడు. ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ ఖాతాలో 66 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వీరి తర్వాత.. శిఖర్ ధావన్ , రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఏబీ డివిలియర్స్‌ వరుస స్థానాల్లో ఉన్నారు.

Exit mobile version