Site icon NTV Telugu

Virat Kohli New Tattoo: ఐపీఎల్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Virat

Virat

Virat Kohli New Tattoo: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ వేయించుకున్నాడు. ఇప్పటికే విరాట్ చేతిపై పులు టాటూలు ఉన్న విషయం తెలిసిందే. మరో తాజాగా టాటూను జోడించాడు. తన కెరీర్‌లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా ఈ సీజన్‌ బరిలోకి దిగుతున్న కోహ్లీ, తన వ్యక్తిత్వ పరిణామం, పరిపూర్ణతకు చిహ్నంగా తన ఎడమ చేతిపై ఉన్న పాత టాటూలను కొత్త హంగులతో మెరుగుపరుచుకున్నాడు. ‘ఏలియన్స్ టాటూ ఇండియా’లో ఈ టాటూ వేయించుకోగా, ఆ సంస్థ దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఈ టాటూ అభిమానుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. శివుని స్ఫూర్తితో రూపొందించిన ఒక బాహుబంధాన్ని పునఃరూపకల్పన చేశారు. స్పష్టమైన రూపాన్ని తిరిగి తీసుకువచ్చారు.

READ MORE: Anantapur Crime: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..

ఈ టాటూ గురించి . ‘ఏలియన్స్ టాటూ ఇండియా’ ప్రతినిధులు వివరిస్తూ.. ఇది కేవలం స్టైల్ కోసం వేయించుకున్నది మాత్రమే కాదని, కోహ్లీ జీవిత ప్రయాణానికి, వ్యక్తిత్వ పరిణామ క్రమానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ గతంలో కంటే చాలా మారారు. తన క్రమశిక్షణతో, అచంచలమైన విశ్వాసంతో ఏ స్థాయికి చేరుకున్నారో ఈ టాటూ ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. వాస్తవానికి కోహ్లీ ఎడమ చేతికి ఇప్పటికే టాటూలు ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న ఆర్మ్‌బ్యాండ్ వంటివి ఉన్నాయి. కాలక్రమేణా అవి మసకబారి పోయాయి. అందుకే ఈ కొత్త డిజైన్‌ను రూపొందించారు. పాత గుర్తులను కొన్నింటిని కవర్ చేస్తూ, మరికొన్నింటిని సరిచేస్తూ.. వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో కలిపి ఒకే ఒక సంపూర్ణమైన ‘ఫుల్ స్లీవ్’ టాటూగా మార్చారు. తనలోని పాత అలవాట్లను వదిలేసి, మరింత దృఢమైన వ్యక్తిగా మారిన కోహ్లీ ప్రస్తుత జీవనశైలిని, ఉద్దేశాలను ఈ పెయింటింగ్ ఎంతో లోతుగా వివరిస్తోంది.

READ MORE: RCB Name Change: ఆర్‌సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం.. నయా నేమ్ ఏంటో తెలుసా?

Exit mobile version