NTV Telugu Site icon

Virat Kohli: ‘నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా’.. విరాట్ సంచలన వ్యాఖ్యలు..

Virat Kohli

Virat Kohli

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్కతా నైట్ రైడర్స్ భారీ విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇక నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ క్రమంలో నేడు ఆర్సిబి తొలి గండాన్ని దాటేందుకు సిద్ధమయింది. నేడు రాత్రి జరగబోయే మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనుంది.

Sachin – Ratan Tata: ఇద్దరు దిగ్గజాలు ఒకే చోట.. ఫోటో వైరల్..

ప్రస్తుత సీజన్ లో ఆర్సిబి మొదటి అర్థభాగంలో ఘోరంగా విఫలమైన తర్వాత., వరుసగా 6 మ్యాచ్లు విజయం సాధించి ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన సంగతి తెలిసింది. ఈ జర్నీలో ఆర్సిబి జట్టులో కెప్టెన్ డూప్లిసిస్ తోపాటు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా కీలకపాత్రను పోషించాడు. ప్రస్తుతానికి విరాట్ 14 ఇన్నింగ్స్ లో ఏకంగా 708 పరుగులను సాధించి సీజన్ ఆరెంజ్ క్యాప్ ను తన వద్ద ఉంచుకున్నాడు. ఇక నేడు జరగాల్సిన ఆటపై తాజాగా స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను తెలిపారు.

YouTuber: చిక్కుల్లో చెన్నై యూట్యూబర్.. భార్యతో దుబాయ్ వెళ్లి ఏం చేశాడంటే..!

ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను అతిగా ఆలోచించనని., గణాంకలను నేను పెద్దగా పట్టించుకోనంటూ తెలుపుతూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్ రిస్ట్ పొజిషన్ ఏంటి.., అతను బాలు ఎక్కడ వేస్తాడన్న విశ్లేషణకు సంబంధించి ఎలాంటి వీడియోలు చూడనని తెలిపారు. దీనికి కారణం మ్యాచ్ సమయానికి ఆ బౌలర్ కూడా సరికొత్త ప్రణాళికలతో మన ముందుకు రావచ్చు కదా.. కాబట్టి అందుకు తగ్గ పరిస్థితులకు ఆడేందుకు తాను ముగ్గు చూపుతానని తెలిపాడు. ముఖ్యంగా బౌలర్ బౌలర్‌ బంతిని సంధించే సమయంలో తాను కేవలం నా కళ్ళను మాత్రమే నమ్ముకుంటానని., బాలుకు రియాక్ట్ అయ్యే విషయంలో నా మెదడు ఏం చెప్తే అది చేస్తానని తెలిపాడు.

ముఖ్యంగా మనకు మనం నిర్ణయాలు తీసుకోగలిగితే సమస్యలకు సరైన పరిష్కారాలు కనుక్కోగలమని నేను బలంగా నమ్ముతానని తెలిపాడు. తాను కంప్యూటర్ అనాలసిస్ లాంటి పరిస్థితిలను అంచనా వేయలేమని., మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు తమకు ఫలితాలు ఇస్తాయని అందుకోసం తాను ఎప్పుడు బేసిక్స్ ను మర్చిపోనని తెలిపాడు. అందుకే కాబోలు తాను మూడు ఫార్మేట్ లలోను ఒకే విధంగా ఆడటానికి ఓ రకంగా అదే కారణమంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.