NTV Telugu Site icon

Viral Video: ఆహారం కోసం ఆశగా నోరు తెరచిన హిప్పోపొటామస్.. ఈ పర్యాటకుడి పనికి అందరూ షాక్!

Hippopotamus Plastic Cover

Hippopotamus Plastic Cover

A Man threw a plastic cover in mouth of Hippopotamus: ఈ భూప్రపంచంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. జంతువుల రక్షణ కోసం స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. ఏ జంతువుకైనా చిన్న గాయమైనా అల్లాడిపోయే వారు చాలా మందే ఉన్నారు. కొందరు మాత్రం జంతువుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ ఆనందం కోసం అమాయక జంతువులను హింసిస్తున్నారు. ఇప్పటికే ఏనుగు తినే ఆహారంలో బాంబ్ పెట్టిన ఘటన సంచలనంగా మారగా.. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆహారం కోసం ఆశగా నోరు తెరచిన హిప్పోపొటామస్ నోట్లో ఓ పర్యాటకుడు ప్లాస్టిక్ కవర్ వేశాడు.

వీడియో ప్రకారం… పార్క్‌లో ఉన్న నీటిలో కొన్ని హిప్పోపొటామస్‌లు (నీటి ఏనుగు) ఉన్నాయి. అందులో ఒకటి ఒడ్డున తిరుగుతూ ఉంది. కారులో అటుగా వెళ్తున్న పర్యాటకులను చూసిన అది.. ఆహరం కోసం ఆశగా నోరు తెరిచింది. కారులో ఉన్న ఒక వ్యక్తి.. హిప్పోపొటామస్‌కి క్యారెట్ తినిపించడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే అదే కారులో ఉన్న మరొక వ్యక్తి.. హిప్పోపొటామస్‌ నోటిలోకి ప్లాస్టిక్ కవర్ విసిరాడు. ఆ కవర్ దాని నోట్లో పడగా.. ఆహరం అనుకుని నమిలి మింగేసింది. ఇందుకు సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Realme Narzo 70 Offer: రియల్‌మీ నార్జో 70పై భారీ తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఈ ఒక్క రోజే!

పశ్చిమ జావాలోని బోగోర్‌లోని సఫారీ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. హిప్పోపొటామస్‌ నోటిలోకి ప్లాస్టిక్ కవర్ విసిరిన వీడియో వైరల్‌గా మారడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులను అరెస్టు చేయాలని అధికారులను అభ్యర్థించారు. కార్ నంబర్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ తిన్న హిప్పోను పరీక్షించామని, అది ఆరోగ్యంగానే ఉందని పార్క్ ప్రతినిధి అలెగ్జాండర్ జుల్కర్‌నైన్ తెలిపారు.

Show comments