Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!

Viral Video

Viral Video

Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చితో కొందరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా.. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా అసభ్యకర వీడియోలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా రన్నింగ్ బస్సులో ఓ యువతి రీల్స్ కోసం చేసిన వికృత చేష్టలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇదివరకు కొండ ప్రాంతాలు, జలపాతాల వద్ద ప్రమాదకర రీల్స్ చేస్తున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. మరోవైపు, బస్సుల్లో ప్రయాణించే మహిళలను కొందరు ఆకతాయిలు వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి వీడియోలకు ప్రజల నుంచి సింపతీ లభిస్తుండటాన్ని కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జనాల్ని తప్పుదోవ పట్టించేలా, కావాలనే వేధింపులకు గురవుతున్నట్లు నటిస్తూ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ యువతి రన్నింగ్ బస్సులో ప్రయాణిస్తూ రీల్స్ తీసేందుకు ప్రయత్నించింది. ఎలాగైనా తన వీడియో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో బస్సులో నిలబడి ఉన్న ఓ వ్యక్తి వెనుకకు వెళ్లింది. ఆ వ్యక్తి కనీసం ఆమె వైపు చూడకపోయినా, కావాలనే అతడిని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. పలుమార్లు ఉద్దేశపూర్వకంగానే తన శరీర భాగాలను అతడికి తాకిస్తూ కెమెరాలో వీడియో రికార్డు చేసింది. ఆ యువతి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “ఇదెక్కడి విడ్డురం.. కేవలం వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతగా దిగజారాలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దెత్తున నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.