NTV Telugu Site icon

Viral Video : ఏం క్రియేటివిటి బాసూ.. హ్యాట్సాఫ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

bike

bike

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ ను చూపిస్తూ జనాలను తెగ ఆకట్టుకుంటున్నారు..కొందరు వారిలోని టాలెంట్ ను బయట పెడితే.. మరికొంత మంది అద్భుతాలను సృష్టిస్తున్నారు.. కరోనా తర్వాత జనాలకు తెలివి బాగా పెరిగింది.. ఒక్కోక్కరు ఔరా అనిపించేలా కొత్త వస్తువులను తయారు చేస్తున్నారు.. తాజాగా ఓ వ్యక్తి తన బైకును కారుగా మార్చి అందరిని ఆశ్చర్య పరిచాడు.. అందుకు సంబందించిన వీడియో కూడా ఒకటి జనాలను బాగా ఆకాట్టుకంటుంది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన బైకును ఏకంగా కారుగా మార్చేశాడు. అది కూడా ఏదో మార్చాం అంటే మార్చాం అన్నట్లు కాకుండా.. అచ్చం కారు లాగానే ఉండేలా తీర్చిదిద్దాడు. ఇందుకోసం బైక్‌కు కారు బాడీని ఫిట్ చేశాడు. బైకు టైర్లు కాకుండా మరోవైపు మూడో టైరును ఏర్పాటు చేశాడు.. అలాగే బైకు పక్కనే మరో ఇద్దరు కూర్చునేందుకు వీలుగా సీట్లు కూడా అమర్చాడు. వెనుక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా కారుకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతంగా తయారు చేశారు..

అంతేకాదు వెనుక వైపు కూడా లగేజీ పెట్టుకునేందుకు స్థలం ఉండేలా డిజైన్ చేశాడు. కాస్త దూరం నుంచి చూస్తే అచ్చం కారు లాగానే కనిపిస్తుండడంతో అంతా దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.. నీ తెలివికి జోహార్లు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..