NTV Telugu Site icon

Viral Video : వామ్మో.. ఈ చెట్టు కొమ్మకు మొత్తం నాణాలే.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

Mny Plant

Mny Plant

డబ్బులు ఎవరికి ఊరికే రావు.. చెట్లకు కాయడం ఎప్పుడూ చూసి ఉండరు.. చెట్లకు కాయలు, పూలు, పండ్లు మాత్రమే కాస్తాయి.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మైండ్ దిమ్మతిరిగి బ్లాక్ అండ్ రెడ్ అవుతుంది.. అంటే నాణేలు కాసిన చెట్టు అది.. కొమ్మ కొమ్మకు నాణేలు ఉండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది..

చాలా మందికి మొక్కలు నాటడం అంటే ఇష్టం రకరకాల మొక్కలను తెచ్చి ఇంట్లో పెడుతుంటారు. ముఖ్యంగా మనీ ప్లాంట్ వంటి మొక్కల్ని. అయితే రీసెంట్‌గా ఓ చెట్టు కొమ్మలకు నాణాలు కనపడ్డాయి. ఇక జనాలకు వింతగా అనిపించింది. చెట్టుకి నాణాలు కాస్తున్నాయని ఆశ్చర్యపోయారు. అయితే ఇది నిజమేనా? సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చెట్టు కొమ్మలకు అత్తుక్కుని అనేక నాణాలు కనిపించాయి… ఆ నాణేలును కొందరు మనుషులు రాళ్లతో కొట్టి తీసుకుంటున్నారు..

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. కొందరు చెట్లను దేవుడిగా కొలుస్తారు. వారి కోరికలు నెరవేరాలని పూజలు చేస్తారు. ఆ సమయంలో చెట్లపై నాణాలు విసురుతారు. అలా 100 సంవత్సరాలుగా ఈ చెట్టుపై నాణాలు విసరడం వల్ల అవి చెట్లపై అతుక్కుపోయాయని కొందరు చెబుతున్నారు.. ఆ నాణేలు ఇప్పుడు ఇలా బయట పడి ఉంటాయాని కొందరు నిపుణులు చెబుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..