NTV Telugu Site icon

Viral Video : వార్నీ.. ఇదేం పిచ్చిరా నాయనా.. రైళ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న రెజ్లర్లు..

Rejlars

Rejlars

రెజ్లర్లు.. ఈ పేరు వినగానే అందరికి వినిపించే పేరు కుస్తీ.. ఇక ఈమధ్య ఎక్కువ మంది బాక్సింగ్ ను ఇష్టపడుతున్నారు.. వీళ్లు పోటి పడుతున్నారు అంటే అది ఒక రింగ్ లో మాత్రమే.. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు వీళ్లు కూడా కొత్తధనం కోరుకున్నారేమో అన్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అందులో వీళ్లు రద్దీగా ఉన్న రైళ్లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు..

స్పీడ్ గా వెళుతున్న బుల్లెట్ రైలులో రెజ్లింగ్ టోర్నమెంట్ నిర్వహించారు..ఏంటి నిజమా అని ఆలోచిస్తున్నారా అవును మీరు విన్నది నిజమే.. జెట్ స్పీడ్ లో వెళుతున్న రైళ్లో ఈ కుస్తీ పోటి జరిగింది.. ఈ పోటీలు జపాన్‌లో జరిగింది. అక్కడ రెజ్లర్లు నిండిన బుల్లెట్ రైలులో ఒకరితో ఒకరు అరగంట పాటు పోటీపడి ప్రేక్షకులను అలరించారు.డీడీటీ ప్రో-రెజ్లింగ్ ఈ ఈవెంట్‌ను జపాన్‌లో నిర్వహించింది. ఆసక్తికరంగా, ఈ టోర్నమెంట్‌లోని మొత్తం 75 సీట్లు కేవలం అరగంటలో అమ్ముడయ్యాయి. టోక్యో, నగోయా మధ్య 180 ఎంపీహెచ్ నోజోమీ షింకన్‌సెన్ బుల్లెట్ రైలులో డీడీటీ ప్రో-రెజ్లింగ్‌కు చెందిన ఇద్దరు ప్రసిద్ధ రెజ్లర్లు మినోరు సుజుకి, సంషిరో టకాగి మధ్య నిర్వహించారు..

ఇక ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విపరీతమైన కొట్టుకున్నారు. ఇది ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రేక్షకులు వారి వారి సీట్లలో కూర్చొని ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌ను తన మొబైల్‌లో రికార్డ్ చేకుంటూ సంబపరపడిపోయారు. దీని వీడియో ఇంటర్నెట్‌లో కూడా వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో మినోరు సుజుకీ విజయం సాధించింది. కదులుతున్న రైలులో పోటీపడుతున్న రెజ్లర్‌పై సుజుకి ఇలాంటి ఎన్నోవిచిత్ర ప్రయోగాలు చేసిందని తెలుస్తుంది.. ఈ మ్యాచ్ కోసం ట్రైన్ లో ఒక కోచ్ ను బుక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు.. ఇక ఆటగాళ్ళు కూడా రెచ్చిపోయి కొట్టుకున్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఆ పోటిని వీక్షించండి..