NTV Telugu Site icon

Viral Video: నీ మైండ్ ఏమైనా దొబ్బిందా?.. బౌలర్‌పై రోహిత్ శర్మ ఫైర్!

Rohit Sharma Harshit Rana

Rohit Sharma Harshit Rana

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. జో రూట్‌ (69; 72 బంతుల్లో 6×4), డకెట్‌ (65; 56 బంతుల్లో 10×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యాన్ని భారత్‌ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (119; 90 బంతుల్లో 12×4, 7×6) సెంచరీ చేయగా.. శుభ్‌మన్‌ గిల్‌ (60; 52 బంతుల్లో 9×4, 1×6) అర్ధ శతకం బాదాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్.. బౌలర్‌ హర్షిత్ రాణాపై ఫైర్ అయ్యాడు. ‘నీ మైండ్ ఏమైనా దొబ్బిందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: Rohit Sharma: రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కినెట్టి.. గేల్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్!

ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా హర్షిత్ రాణా 32వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లోని ఐదో బంతిని జోస్ బట్లర్ డిఫెన్స్ ఆడాడు. బంతిని అందుకున్న హర్షిత్.. అవసరం లేకున్నా బంతిని వికెట్ల వైపు బలంగా విసిరాడు. బంతి కాస్త కీపర్‌ కేఎల్ రాహుల్‌కు దూరంగా వెళుతూ.. బౌండరీకి దూసుకెళ్లింది. దాంతో ఓవర్ త్రో రూపంలో ఇంగ్లండ్‌కు అదనంగా 4 పరుగులు వచ్చాయి. బట్లర్ పరుగు కోసం ప్రయత్నించకున్నా.. హర్షిత్ బంతిని విసిరిన తీరుతో రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. హర్షిత్ బౌలింగ్ కోసం వెళుతుండగా.. ‘నీ మైండ్ ఏమైనా దొబ్బిందా’ అంటూ హిట్‌మ్యాన్‌ హిందీలో తిట్టాడు. అందుకు హర్షిత్ ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.