NTV Telugu Site icon

Viral Video : విమానాన్ని చుట్టుముట్టిన దోమల దండు.. ఎక్కడంటే?

Mexico

Mexico

దోమలు దండు వల్ల విమానం తన ప్రయాణాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.. కోతులు, పాములు వస్తే ఆగిపోయిన ఘటనలను మనం చూసే ఉంటాం.. కానీ ఇలా దోమలు విమానాన్ని ఆపడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం.. దోమలు ఫ్లైట్‌లో దాడి చేయడంతో ఓ విమానం బయలుతేరాల్సిన టైమ్‌కి టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది.. ఒక్కసారిగా దోమలు దండయాత్ర చెయ్యడంతో ప్రయాణీకులు ఇబ్బందికి గురయ్యారు.. వెంటనే సిబ్బంది అలెర్ట్ అవ్వడంతో దోమలను అరికట్టారు..

ఈ వింత ఘటన మెక్సికోలో వెలుగు చూసింది.. పాసింజర్ ఫ్లైట్ అయిన వోలారిస్ విమానం గువాడలహార నుంచి మెక్సికో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అంతే ఎటువైపు నుంచి వచ్చిందో ఓ దోమల దండు విమానంలోకి చొరబడింది. దాంతో ప్రయాణికులంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఇక విమాన సిబ్బంది దోమల్ని తోలే పనిలో పడ్డారు.. విమాన సిబ్బంది దోమలపై స్ప్రే చల్లుతూ వాటితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. స్ప్రే కారణంగా విమానం అంతా పొగ కమ్మేసింది. ఈ తతంగాన్ని కొందరు ప్రయాణికులు వీడియో తీయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది..

దోమలను కష్టపడి తరీమేసిన సిబ్బందిని ప్రయాణీకులు ప్రశంసలు కురిపించారు.. మెక్సికన్ విమానంలో దోమల గుంపులు దాడి చేయడం ఇదేం మొదటిసారి కాదట. 2019 లో కూడా ఇలాంటి సంఘటన జరిగిందట. ఎయిర్ పోర్టుకి దగ్గరలో తరచుగా వరదలు సంభవిస్తుండటంతో పాటు భారీ వృక్షాల కారణంగా దోమల బెడద ఎక్కువగా ఉంటుందని విమాన అధికారులు చెబుతున్నారు.. ఏది ఏమైనా విమానంలోకి దోమలు రావడంతో జనాలు ఇబ్బందులకు గురయ్యారు.. ఈ దోమల దాడి వీడియోను ఒకసారి చూడండి..