బుధవారం ముంబైలో వార్షిక సియట్ క్రికెట్ అవార్డులను భారత క్రికెట్ నిర్వహించింది. భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ దక్కింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ‘అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో భారత స్టార్ క్రికెటర్లందరూ పాల్గొన్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సియట్ అవార్డుల కార్యక్రమానికి టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ హాజరయ్యాడు. కాస్త ముందుగా వచ్చిన శ్రేయస్.. ముందువరుసలో ఉన్న సీట్‌లో కూర్చొన్నాడు. కాస్త ఆలస్యంగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మకు ముందు వరుసలో సీటు దొరకలేదు. రోహిత్ రావడాన్ని గమనించిన శ్రేయస్.. లేచి నిలబడి తన కుర్చీలో కూర్చోవాలని కోరతాడు. అందుకు రోహిత్ నవ్వుతూ.. శ్రేయస్‌నే అందులో కూర్చోబెడుతాడు. ఆపై వెనకాల మరొక సీట్‌లో హిట్‌మ్యాన్ కూర్చున్నాడు.
Also Read: Chiranjeevi Birthday: శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు!
రోహిత్ శర్మ తన సతీమణి రితిక పక్కన కూర్చొంటాడు. హిట్‌మ్యాన్‌కు కొద్దిగా ముందు ఉన్న ఛైర్‌లో శ్రేయస్ అయ్యర్ కూర్చొంటాడు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీనియర్ పట్ల శ్రేయస్ చూపించిన గౌరవానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చాయి. లంక పర్యటన అనంతరం భారత క్రికెట్ జట్టుకు 42 రోజుల విరామంలో దక్కింది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొననున్నారు. అంతకుముందు సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో కొందరు ప్లేయర్స్ ఆడనున్నారు.
How sweetly Shreyas got up and gave his seat to Rohit Sharma. 🤌❤️🥹 pic.twitter.com/goVZGDrNAW
— Pick-up Shot (@96ShreyasIyer) August 21, 2024