Site icon NTV Telugu

Viral Video: స్విగ్గీ బాయ్ కక్కుర్తి.. పార్శిల్ ఇవ్వడానికి వచ్చి ఏం చేశాడంటే..!

Parcel

Parcel

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన బాయ్ చేసిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి కక్కుర్తి పనికి పాల్పడ్డాడు. ఈ యవ్వారం కాస్త సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ వీడియో స్విగ్గీ యాజమాన్యానికి చేరడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: Kishan Reddy: దేశం బాగుండాలంటే మోడీని గెలిపించాలి..

గురుగ్రామ్‌లో ఈనెల 9న అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ ఫ్యామిలీ ఫుడ్ డెలివరీ పెట్టుకున్నారు. స్విగ్గీకి చెందిన బాయ్.. అపార్ట్‌మెంట్ పైకి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. లోపలి నుంచి వచ్చేటప్పటికీ కొంత ఆలస్యం కావడంతో డోర్ ముందు ఉన్న షూలపై కన్ను పడింది. ఇంటి ముందు మూడు జతల షూలు ఉన్నాయి. ఇంతలో కస్టమర్ వచ్చి ఫుడ్ తీసుకుని డోర్ వేసేసింది. అనంతరం బాయ్… కిందకి వెళ్లిపోతున్నట్లుగా నటించి.. మళ్లీ పైకి వచ్చి ఒక జత షూను టవల్‌లో చుట్టుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అనంతరం బాధితులు షూ ఏమయ్యాయని సీసీటీవీ పరిశీలించగా ఈ బండారం బయటపడింది.

ఇది కూడా చదవండి: Laxman: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..

అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అత్యధిక సంఖ్యలో వీక్షించారు. నిందితుడ్ని శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. కెమెరా నిందితుడ్ని భలే పట్టించిందని మరొకరు పేర్కొన్నారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్విగ్గీ స్పందిస్తూ.. మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.

 

Exit mobile version