Site icon NTV Telugu

Lucky Fellow : ఆత్మహత్య చేసుకుందామని ఆరో అంతస్తు నుంచి దూకాడు.. కానీ లక్కీ ఫెల్లో

Safty Net

Safty Net

Lucky Fellow : భూమి మీద నూకలు ఉండడం అంటే ఇదే కావొచ్చు. చనిపోవాలని ఓ వ్యక్తి బిల్డింగ్ ఎక్కి ఆరో అంతస్తునుంచి దూకాడు. కానీ అతడికి ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోనట్లుంది.. బతికేశాడు. ఎలాగనుకుంటున్నారా.. ఆ భవనానికి ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్ లో చిక్కుకుని బతికిపోయాడు మనోడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో చోటు చేసుకుంది. ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న వ్యక్తి మహారాష్ట్ర హెడ్ ఆఫీసు మంత్రాలయ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అయితే పరిరక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన వలలో పడ్డాడు. తన ఆత్మహత్యా యత్నం ఫలించకపోవడంతో ఆ వ్యక్తి అరిచి గోలపెట్టాడు. సేఫ్టీ నెట్‌లో పడిన అతడ్ని బయటకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యా యత్నం చేయడానికి గల కారణాలపై ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా, 2018 ఫిబ్రవరిలో మంత్రాలయ భవనం పైనుంచి నలుగురు వ్యక్తులు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రక్షణ వల ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా భవనం చుట్టూ మధ్యలో ఉన్న పది వేల చదరపు అడుగుల ఖాళీ ప్రాంతంపై దృఢమైన రక్షణ వలను ఏర్పాటు చేశారు. దీంతో నాటి నుంచి మంత్రాలయ భవనంలో ఆత్మహత్యా సంఘటనలు తగ్గాయి.

Exit mobile version