NTV Telugu Site icon

Viral video: నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్.. వాహనదారులకు ఇక్కట్లు

Caee

Caee

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. రీల్స్ కోసం కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో నెటిజన్ల ఆగ్రహానికి గురి కావల్సివస్తోంది. తాజాగా లక్నోలో జరిగిన సంఘటనపై వాహనదారులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: CPI Narayana: తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు

లక్నో రోడ్డు మధ్యలో యువకులు వాహనాలను నిలిపి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సుశాంత్ గోల్ఫ్ సిటీ ఏరియాలోని ఐకానా స్టేడియం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. కార్లతో రోడ్డును బ్లాక్ చేసిన తర్వాత కేరింతలు కొడుతూ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో చర్యలకు ఉపక్రమించారు. మార్గమధ్యలో వీరంగం సృష్టిస్తూ కెమెరాలో చిక్కుకున్న నిందితులను గుర్తిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Maharastra : మ్యాంగో జ్యూస్‎లో నిద్రమాత్రలు కలిపిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

సోషల్ మీడియాలో లైక్స్, ఫేమ్ కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారని ఈ ఘటన తెలియజేస్తోంది.  ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు బిజీగా ఉంటే వారి మధ్య ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ అభ్యంతరం కలిగించింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show comments