NTV Telugu Site icon

Viral Video: కోటీశ్వరుడిని చేసిన పాస్తా.. ఏంటి నమ్మట్లేదా? ఇదిగో ప్రూఫ్..

Pasta

Pasta

ఒకప్పుడు ఇడ్లీ, దోస, వడ, పూరి అనేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది భయ్యా.. పాస్తా, పిజ్జా, బర్గర్ అంటున్నారు జనాలు.. ఇక వింత వంటలను ట్రై చేస్తూ జనాలకు మెంటేలెక్కిస్తున్నారు.. కొంతమంది క్రెజీగా ఆలోచిస్తూ జనాలను ఆకట్టుకోవడమే కాదు. డబ్బులను కూడా సంపాదిస్తున్నారు.. వెరైటీ ఫుడ్ పేరుతో వంటలను తయారు చేస్తున్నారు.. దానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు.. తాజాగా ఓ యువకుడు రొయ్యలు, పాస్తా తో వింత వంట చేశాడు.. ఆ డిష్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాగా ఫెమస్ అయ్యాడు.. దెబ్బకు లక్షలు కూడా పొందాడు.. ఏంటి నమ్మడం లేదా ఇదిగో ప్రూఫ్ చూడండి..

ఈ మధ్య కాలంలో ప్రజలు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా మంచి మొత్తాన్ని సంపాదిస్తున్నారు. కొందరు వ్యక్తులు కేవలం ఒక పోస్టు ద్వారా రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారు. వారిలో అమెరికాకు చెందిన జియాన్‌లూకా కాంటె కూడా ఒకరు, కొన్నేళ్ల క్రితం పాస్తా తయారు చేయడం.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించాడు.. అలా అతని జీవితాన్నే పాస్తా మార్చేసింది..

అక్కడ పాస్తాతో పాటు అతని తయారీ విధానానికి జనాలు తెగ ఆకర్శితులు అయ్యారు.. ఆ తర్వాతే అతను పాస్తాలలో కొత్త కొత్త వంట రకాలను తయారు చేస్తూ వస్తున్నాడు.. సోషల్ మీడియాలో వీడియోలను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వీడియోలు ప్రస్తుతం మిలియన్ల వ్యూస్ ను పొందడం ప్రారంభించింది.. అతన్ని ప్రస్తుతం కోటి మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ అతని వీడియోలను చాలా ఇష్టపడతారు. జియాన్లూకా చాలా అందగాడు దీంతో మోడలింగ్ చేయడానికి ఆఫర్లను అందుకోవడం ప్రారంభించాడు. అనేక ప్రసిద్ధ బ్రాండ్లతో పని చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా కనీసం లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. అమ్మాయిలు కూడా తనని చాలా ఇష్టపడతారని డేటింగ్ కు రెడీ అయిపోతారని కూడా చెప్పుకొచ్చారు.. మొత్తానికి అతని పాస్తాకు డిమాండ్ పెరిగింది..