NTV Telugu Site icon

Kedarnath Yatra: సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు.. కేదారినాథ్ యాత్రలో ఘటన

Water

Water

Man Slip in to River while Taking Selfie: ఈ మధ్యకాలంలో సెల్ఫీల పిచ్చి, రీల్స్ పిచ్చా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఫస్ట్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా ఫోన్ లు ఉన్నాయి కదా అని ఫోటోలు మీద ఫోటోలు దిగుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలా వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ప్రమాదంలో పడిన చాలా మంది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటిదే ఓ వీడియో తాజాగా ఇంటర్నెట్ లో చక్కర్ల కొడుతుంది. ఈ ఘటన కేదారినాథ్ యాత్రలో చోటు చేసుకుంది.

Also Read: Andhra Pradesh: కొత్త కోడలికి అదిరిపోయే కానుక.. గోదారోల్లా మజాకా..!

ఉత్తరఖండ్ లో కేదారినాథ్ యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో మందాకినీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే నది అంతలా ప్రవహిస్తున్నా కూడా ఓ యువకుడు నదిలో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఫోటో తీసుకుంటూ ఉండగా నదిలో జారి పడి కొట్టుకుపోయాడు. అయితే లక్ బాగుండటంతో ఆ యువకుడు అక్కడ కొన్ని బండరాళ్లను పట్టుకోగలిగాడు. ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ అక్కడ ఉన్న అతడిని కొంతమంది స్థానికులు గమనించి సాయం చేశాడు. ఎట్టకేలకు భూమి మీద ఇంకా నూకలు మిగిలున్నాయో ఏమో కానీ అతడు బతికిబట్టకట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని పొలిటికల్ క్రిటిక్ అనే యూజర్ ఎక్స్( ట్విటర్) లో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్స్ ప్రాణాల కంటే సెల్ఫీ మోజు ఎక్కువయిపోయిందంటూ తిట్టిపోస్తున్నారు. ఇది చూసిన వారైనా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలని పలువురు యూజర్లు సూచిస్తున్నారు.