Site icon NTV Telugu

Naagin Dance: వీడెవడండి బాబు.. కోబ్రాకే ‘నాగిని డాన్స్’ నేర్పిస్తున్నాడు.. వైరల్ వీడియో

Naagin Dance

Naagin Dance

Naagin Dance: సోషల్ మీడియాలో కొన్ని సార్లు జంతువులకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించి వైరల్ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఆ వీడియోలో ఓ యువకుడు, ప్రాణాలకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో చూపించాడు. వీడియోలో ప్రకారం ఓ నాగుపాము ముందు మోకాళ్లపై కూర్చొని ‘నాగిన్ డాన్స్’ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తాను చేసిన పని ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

Vijay: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు!

ఈ వీడియోలో వ్యక్తి ఎటువంటి భయం లేకుండా పాము ముందే డాన్స్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా పామును చేతిలోకి తీసుకొని, తన మెడకు చుట్టేసి నానా హంగామా చేశాడు. అతడు ఏదో పాములను పట్టడంలో ప్రోఫిసినల్ లాగా వ్యవహరించాడు. కానీ, పాము చివరికి తన స్వభావం చూపించింది. ఒక్కసారిగా బుసకొడుతూ అతన్ని కాటేసింది. ఇక్కడ వీడియోలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాము కాటు తర్వాత కూడా వ్యక్తి డాన్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు. అంతేకాక, చివర్లో అతడి గాయమైన చేతి ఫోటో కూడా చూపించబడింది. ఇది చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. అయితే, ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు.

Digital Arrest Scam: స్కామర్లకు మహిళా వైద్యురాలు బలి.. రూ.19 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు!

ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఇందులో కొందరు, జీవితం విలువైనది.. దీన్ని ఆటలా తీసుకోకండి.. అంటూ కామెంట్స్ చేయగా, మరికొందరేమో.. పాముకు ఎన్ని పాలు పోసి పెంచిన ఏదో ఒకరోజు దాని స్వభావాన్ని బయట పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు.. ఇలా చేస్తే, డేర్‌ డెవిల్ కాదు.. డెడ్‌ డెవిల్ అవుతాడని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version