Site icon NTV Telugu

Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదే.. లారీ కింద పడ్డా ఏమీ కాలేదు, స్కూటీ మాత్రం..!

Kakinada Scooty Viral Video

Kakinada Scooty Viral Video

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో షాకింగ్ ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని ఘటనలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటే.. మరికొన్ని హృదయ విదారకంగా ఉంటాయి. మరికొన్ని అయితే నమ్మలేని రీతిలో ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ వ్యక్తి లారీ కింద పడ్డా ఏమీ కాలేదు. ఈ వీడియో చూస్తే.. పెద్దలు చెప్పిన ఓ మాట తప్పక గుర్తొస్తోంది. ‘వీడికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయిరో’. ఇక వివరాల్లోకి వెళితే…

ఏపీలోని కాకినాడలో నరేందర్ అనే వ్యక్తి తన స్కూటీపై వెళ్తున్నాడు. ఓ టర్నింగ్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్ టేక్ చేసేందుకు నరేందర్ ప్రయత్నించాడు. ఓవర్ టేక్ చేసే క్రమంలో స్కూటీని లారీ చిన్నగా ఢీకొట్టింది. దాంతో నరేందర్ లారీ ముందు పడిపోయాడు. లారీ అతని పైనుంచే వెళ్లింది. అయితే నరేందర్ లక్కీగా లారీ టైర్ల మధ్యలో పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడి.. మృత్యువును జయించాడు. తీవ్ర గాయం కావడంతో అతడు పైకి లేవలేకపోయాడు.

Also Read: Pinnelli Brothers: జంట హత్యల కేసు.. మరోసారి విచారణకు పిన్నెల్లి సోదరులు!

అటుగా వెళ్తున్న ఓ బైకర్ నరేందర్ పరిస్థితి చూసి సాయం చేశాడు. అప్పుడు అతడు లేచి నిలబడ్డాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఈ ఘటనలో నరేందర్ స్కూటీ దెబ్బతింది. స్కూటీని కాంక్రీట్ మిక్సర్ లారీ కొద్దిదూరం లాక్కెళ్ళింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ‘మృత్యుంజయుడు’, ‘భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version