NTV Telugu Site icon

Viral Video : మెట్రోలో రెచ్చిపోయిన లవర్స్..అందరు చూస్తుండగానే ఆ పని.. వీడియో…

Delhi Metro

Delhi Metro

ఈ మధ్య ఢిల్లీ మెట్రో లవర్స్ రొమాన్స్ కు అడ్డాగా మారింది.. అందరు చూస్తున్నా పట్టించుకోకుండా రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు.. ఇలాంటి వాటిపై ఢిల్లీ మెట్రో సంస్థ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా కూడా జంటలు రొమాన్స్ చేస్తున్నారు.. తమ ప్రవర్తనతో పక్కవాళ్ళు ఇబ్బందిపడుతారనే కనీస ఇంగితం కూడా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ జంట కామంతో రెచ్చిపోయిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ప్రేమ జంట రైలులో ఉద్వేగభరితంగా ముద్దు పెట్టుకోవడం, ఒకరినొకరూ కౌగిలించుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో జంట ముఖాలు స్పష్టంగా కనిపించడం లేవు. కానీ, ఓ యువతి యువకుడు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కదులుతున్న మెట్రోలో కలుసుకున్న ఈ జంట ఆ తర్వాత ఉద్వేగంగా ముద్దుపెట్టుకున్నారు. ఈ విషయం ప్రజలకు సర్వసాధారణమైపోయింది.. వీడియో ప్రకారం.. ఇది ఆనంద్ విహార్‌లో జరిగినట్టు తెలుస్తోంది. హాస్యభరితమైన కామెంట్ తో ఓ నెటిజన్ ఈ వీడియోను పంచుకున్నాడు.. వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..

ఈ ఏడాది మేలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇలాంటి వీడియోల స్ట్రింగ్ వివాదానికి దారితీసిన తరువాత. భద్రతా సిబ్బంది సాధారణ దుస్తులలో స్టేషన్లలో, రైళ్లలో పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.. అంతేకాదు ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే అక్కడ ఉండే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.. ఇక గతంలో మెట్రో కోచ్‌లో నేలపై కూర్చున్న యువ జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై DMRC చాలా తీవ్రంగా స్పందించింది…ప్రయాణికులు అసౌకర్యాన్ని కలిగించే లేదా ఇతర తోటి ప్రయాణీకుల మనోభావాలను కించపరిచే ఎలాంటి అసభ్యకరమైన/అశ్లీల కార్యకలాపాలలో పాల్గొనకూడదనీ, DMRC ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ చట్టం నిజానికి సెక్షన్ 59 ప్రకారం అసభ్యతను శిక్షార్హమైన నేరంగా పరిగణించింది.. అయిన మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం అవ్వడం గమనార్హం..