NTV Telugu Site icon

Viral Video : 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఐస్ క్రీమ్.. ధర ఎంతో తెలుసా?

Gold Icecream

Gold Icecream

బంగారంతో తయారు చేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. రుచితో పాటుగా చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతుంది… అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్ ..ఈ ఐస్ క్రీమ్ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఐస్ క్రీమ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఐస్ క్రీమ్ లను తయారు చేస్తున్నారు.. ఇప్పుడు తాజాగా బంగారంతో తయారు చేసిన ఐస్ క్రీమ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ ఐస్ క్రీమ్ కు ప్రజల నుంచి మంచి ఆధరణను అందుకున్న ప్రత్యేకమైన వంట.. 24 క్యారెట్ల బంగారపు రజనుతో తయారు చేస్తారు.. దీని తయారీ విధానంకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ముందుకు ఒక కోన్ తీసుకొని అందులో చాక్లేట్ ఐస్ క్రీమ్ ను వేస్తారు.. ఆ తర్వాత మరో కలర్ ఐస్ క్రీమ్ ను వేస్తారు.. దానిపై స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం పేపర్ ను ఉంచుతాడు.. దానిమీద రకరకాల జేమ్స్ ను పెడతాడు.. అలాగే చాక్లేట్ వైప్స్ ను పెడతాడు.. చిన్న బిస్కెట్స్ కూడా పెడతాడు.. అంతే ఎంతో టేస్టీగా ఉండే గోల్డ్ ఐస్ క్రీమ్ రెడీ.. హైదరాబాద్ లో ప్రముఖ రెస్టారెంట్ లో దీన్ని తయారు చేస్తారు.. దాని ధర అక్షరాల రూ.999 ఉంటుందని తెలిపారు. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది..