NTV Telugu Site icon

Viral video : క్యాడ్బరి జేమ్స్ తో మ్యాగిని ఎప్పుడైన ట్రై చేశారా? ఇది చూస్తే మ్యాగీ జోలికే వెళ్లరు..

Maggies

Maggies

జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే క్యాడ్బరి జేమ్స్ తో మ్యాగి.. దీని గురించి వింటూనే డోకు వస్తుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఆ మ్యాగిని ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం…

సూపర్ ఫాస్టుగా చేసుకొనే ఫుడ్ ఏంటంటే అది మ్యాగినే.. చాలా ఈ వాసనకు టెంప్ట్ అవుతారు.. ఈ రెసిపీ విచిత్రమైన ఫాంటా మ్యాగీపై హాట్ హాట్‌గా వచ్చింది, ఇందులో ఐకానిక్ ఆరెంజ్ సోడాను మ్యాగీ నూడుల్స్‌కు బేస్‌గా ఉపయోగించడాన్ని ఊహించని ఇంకా అసాధారణమైన సంతృప్తికరమైన కలయికలో ఉపయోగించారు.. అన్ని రకాల రుచులను కలిపి చేసిన దీనిని చూసిన జనాలకు మెంటలెక్కి పోతుంది..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మ్యాగిని తయారు చేస్తాడు.. ముందుగా మ్యాగిని ఒక గిన్నెలో తీసుకోని స్టవ్ మీద పెడతాడు.. ఆ తర్వాత అందులోకి చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్బరి జేమ్స్ ను వేస్తాడు.. అందులో పాలు, ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా కలుపుతాడు.. చివరకు అది నల్లని మ్యాగి లాగా తయారవుతుంది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ లుక్ వేసుకోండి..

1.
0:10
Show comments