NTV Telugu Site icon

Viral Video : కదిలే చెక్క బొమ్మలను ఎప్పుడైనా చూశారా? వీడియో ను చూస్తే షాక్ అవుతారు..

Wooddolls

Wooddolls

కొండపల్లి చెక్క బొమ్మలను మాత్రం మనం చూసి ఉంటాం.. అవి కదులుతాయి.. అందుకే ఆ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి.. ఇక తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఒక ఆర్టిస్ట్ కదిలే చెక్క బొమ్మలను తయారు చేశాడు. వాటిని చూస్తుంటే ఎవరైనా సరే చూడకుండా ఉండలేరు. ఈ వీడియోను సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.. అతని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో బొమ్మలను తయారు చేస్తున్న వ్యక్తి పేరు షీరాన్.. చెక్క బొమ్మలను అద్భుతంగా తయారు చేస్తాడు.. పరిగెత్తుతున్న గుర్రం, ఈత కొడుతున్న చేప, ఎగురుతున్న పక్షి, రెక్కలు ఉన్న పంది, ఇంకా రకరకాల యాక్టివిటీస్‌లో ఎంజాయ్ చేస్తున్న బొమ్మలను చూడవచ్చు. ఇవన్నీ కూడా ప్రాణం వచ్చిన బొమ్మల వలే కదులుతూ ఉన్నాయి. కానీ వీటన్నిటిని చెక్కతోనే అతడు తయారు చేశాడు.. అవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి..

ఈవిధంగా కదిలేలాగా సెటప్ ఏర్పాటు చేయడానికి ఆర్టిస్టు చాలా కష్టపడినట్లు ఉన్నాడు. సదరు ఆర్టిస్ట్ మరో బొమ్మని తయారు చేస్తూ వీడియోలోనే కనిపించాడు. సజీవంగా ఉన్న ఒక జంతు ప్రపంచం ఈ చెక్క బొమ్మలలో మనం చూడవచ్చు.. ఇలాంటి కళాకారులు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వుడెన్ ఆర్టిస్టు పనితనం మనం చూడగలుగుతున్నాం. ఇంకా ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన ఆర్టిస్టులు ఎందరున్నారో వారందరి మాస్టర్ పీస్ లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయితే చూసి బాగా ఎంజాయ్ చేయవచ్చు.. ఈ వీడియో వ్యూస్ తో దూసుకుపోతుంది… మీరు ఓ లుక్ వెయ్యండి..