NTV Telugu Site icon

Viral Video : బెంగుళూరు ట్రాఫిక్ లో ఇరుక్కున్న పెళ్లి కూతురు.. మెట్రోలో ఫోటోలు వైరల్..

Benuguluru Traffic

Benuguluru Traffic

బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వస్తే తమ గమ్యానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి.. ట్రాఫిక్ లో వేచి ఉండాలి.. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి.. మొన్నీమధ్య ఓ మహిళా ఉద్యోగి ట్రాఫిక్ లో కూరగాయలు కోసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఓ పెళ్లి కూతురు వీడియో ఒకటి వైరల్ గా మారింది..

ఈ వీడియోలో ఓ పెళ్లి కూతురు బాగా మూస్తాబయి ట్రాఫిక్ లో బయలు దేరింది.. అయితే ట్రాఫిక్ లో ఇరుక్కు పోయింది.. ఇక చేసేదేమి లేక మధ్యలో దిగి మెట్రో ఎక్కినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.. ఆ తర్వాత సమయానికి మండపానికి చేరుకొని పెళ్లి పీటలు మీద కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.. ఈ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. వధువు తన కుటుంబం మరియు స్నేహితుల తో కలిసి, ఆమె నిజమైన రాణిలా మెట్రో పట్టాలపై నావిగేట్ చేస్తోంది. తనను చూసిన జనాలు ఒకింత ఆశ్ఛర్యానికి గురిచేసింది.. కొందరు ఆమెను చూసి ఎం జరిగిందో అడిగి తెలుసుకోగా .. మరికొందరు అక్కడ ప్రయాణికులు కూడా ఆమెతో ఫోటోలు దిగారు.. మీరు ఆ వీడియోను ఒకసారి చూసేయ్యండి..