Site icon NTV Telugu

Viral Video: సరదాకి కుస్తీ పట్టాలనుకున్న యువకుడు.. దెబ్బకి దూల తీరిందిగా..!

15

15

ప్రస్తుత సమాజంలో చాలామంది ఫేమస్ కావడానికి సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేస్తూ ముందుకు వెళ్తుండగా.. మరికొందరైతే చెడు అలవాట్లతో జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు హెచ్చులకు పోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్న వారు ఎందరో. ఇప్పటివరకు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా చాలానే వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Kumari Aunty: కుమారి ఆంటీనా మజాకానా.. తగ్గేదేలే.. భారీ బంగారం హారాన్నీ కోనేస్తుందిగా…!

వైరల్ గా మారిన వీడియోని గమనించినట్లయితే.. స్టేజి మీద చేతులతో కుస్తీపట్టే కార్యక్రమం సాగుతోంది. అయితే స్టేజ్ మీద ఉన్న ఓ అనుభవమైన వ్యక్తితో కుస్తీపడటంలో చాలామంది ఓడిపోతుంటారు. ఈ క్రమంలో కొంతమంది యువకులు తమ స్నేహితుడిని ఆ ఆటగాడి పై పోటీకి దింపుతారు. అయితే అతను కూడా ఎలాంటి భయం లేకుండా పంతానికి పోయి కుస్తీ పడటానికి అంగీకరిస్తాడు. దాంతో ఎదురుగా ఉన్న వ్యక్తి ముందు కూర్చుని కుస్తీ చేయడానికి చేయి కలిపాడు. అయితే అవతల అనుభవం ఉన్న వ్యక్తి కాస్త బలంగా ఉండడంతో.. ఆటలో ఆ యువకుడి చేయని నేలపైకి తెచ్చే ప్రయత్నాన్ని చేశాడు. అయితే ఆ యువకుడు మాత్రం దాన్ని తిప్పికొట్టేందుకు బాగా ప్రయత్నిస్తాడు.

Also read: Rajnath Singh: “రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్”.. రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ వ్యాఖ్యలు..

కుస్తీ పోటీలో ఓడిపోతే అందరి ముందు పరువు పోతుందన్న ఉద్దేశంతో సదరు యువకుడు వ్యక్తిని ఓడించేందుకు తన శక్తికి మించి సాహసాన్ని చేశాడు. అయితే యువకున్ని గెలవడానికి అవకాశం ఇవ్వకుండా అనుభవం ఉన్న వ్యక్తి ఒక్కసారిగా చేయని బలంగా నేలపై ఆనిస్తాడు. ఇంకేముంది వెంటనే సదరు యువకుడి చేయి విరిగిపోయి ఫట్ మంటూ శబ్దం వినబడింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఒకరు హెచ్చులకు పోతే ఇట్లాగే ఉంటుంది అంటూ ఉండగా.. మరొకరు అయితే., ఎవరైనా శక్తికి మించిన పని చేయొద్దు అంటూ మంచి మాటలు చెబుతున్నారు. మరికొందరైతే.. అయ్యో పాపం.. ఎంత దారుణం., అంటూ బాధపడుతున్నారు.

Exit mobile version