NTV Telugu Site icon

Viral Video: కూతురు కోసం చెరకు గడలను నెత్తిపై పెట్టుకుని 14 కి.మీ సైకిల్ తొక్కిన పెద్దాయన..

Tamilnadu

Tamilnadu

తల్లి దండ్రుల ప్రేమ వెలకట్టలేనిది.. ఎంత రుణం తీర్చుకోవాలని అనుకున్న సరిపోదు.. పిల్లల పై వారి ప్రేమ అనంతం.. పిల్లల ఇష్టం తమ ఇష్టంగా భావించి ఎంతకష్టమైన వాటిని తీర్చేందుకు చూస్తారు.. తమ పిల్లల సంతోషమే తమ సంతోషంగా చాలామంది భావిస్తారు. తాజాగా ఓ వృద్ధుడు తన కూతురికి చెరుకు గడలంటే ఇష్టమని 14 కిలోమీటర్లు చెరుకు గడలను తల మీద పెట్టుకొని సైకిల్ తొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తమిళ్ నాడులో వెలుగు చూసింది.. తన తలపైన కొన్ని చెరకు గడలను పెట్టుకొని సైకిల్ పై పయనమయ్యాడు.. సరుకులు కూడా సైకిల్ పై పెట్టుకున్నాడు..అవి వొత్తుకోకుండా తలపై ఒక టవల్ పెట్టుకున్నాడు. ప్రజలు అతన్ని ఆశ్చర్యంతో చూశారు, మార్గం మధ్యలో అతనిని ఉత్సాహపరిచారు.. ఆ దృశ్యానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

తన కూతురు సుందరపాల్‌కి పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదని.. చివరికి ఎనిమిదేళ్ల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పాడు. అప్పటినుంచి తలపై చెరకు గడలు మోస్తూ సైకిల్‌ తొక్కుతూ ఆమెకు పొంగల్ కానుకగా ఇవ్వడం మొదలుపెట్టానని చెల్లదురై చెప్పాడు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, అందుకే తన కూతురు, మనవళ్లను చూసేందుకు సైకిల్‌పై సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నానని చెప్పాడు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. మీ ప్రేమ అనంతం, వర్ణణాతీతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..