Viral Video: కూతురు కోసం చెరకు గడలను నెత్తిపై పెట్టుకుని 14 కి.మీ సైకిల్ తొక్కిన పెద్దాయన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి దండ్రుల ప్రేమ వెలకట్టలేనిది.. ఎంత రుణం తీర్చుకోవాలని అనుకున్న సరిపోదు.. పిల్లల పై వారి ప్రేమ అనంతం.. పిల్లల ఇష్టం తమ ఇష్టంగా భావించి ఎంతకష్టమైన వాటిని తీర్చేందుకు చూస్తారు.. తమ పిల్లల సంతోషమే తమ సంతోషంగా చాలామంది భావిస్తారు. తాజాగా ఓ వృద్ధుడు తన కూతురికి చెరుకు గడలంటే ఇష్టమని 14 కిలోమీటర్లు చెరుకు గడలను తల మీద పెట్టుకొని సైకిల్ తొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తమిళ్ నాడులో వెలుగు చూసింది.. తన తలపైన కొన్ని చెరకు గడలను పెట్టుకొని సైకిల్ పై పయనమయ్యాడు.. సరుకులు కూడా సైకిల్ పై పెట్టుకున్నాడు..అవి వొత్తుకోకుండా తలపై ఒక టవల్ పెట్టుకున్నాడు. ప్రజలు అతన్ని ఆశ్చర్యంతో చూశారు, మార్గం మధ్యలో అతనిని ఉత్సాహపరిచారు.. ఆ దృశ్యానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
Also Read
తన కూతురు సుందరపాల్‌కి పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదని.. చివరికి ఎనిమిదేళ్ల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పాడు. అప్పటినుంచి తలపై చెరకు గడలు మోస్తూ సైకిల్ తొక్కుతూ ఆమెకు పొంగల్ కానుకగా ఇవ్వడం మొదలుపెట్టానని చెల్లదురై చెప్పాడు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, అందుకే తన కూతురు, మనవళ్లను చూసేందుకు సైకిల్‌పై సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నానని చెప్పాడు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. మీ ప్రేమ అనంతం, వర్ణణాతీతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
#WATCH | Pudukkottai, Tamil Nadu: An elderly man carried a bunch of sugarcane on his head and rode a bicycle for 14 kilometres to give it as a Pongal gift to his daughter. People watched him with surprise and cheered for him on his way pic.twitter.com/gvxQPGjXz1
— ANI (@ANI) January 14, 2024
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!