NTV Telugu Site icon

Viral: అయ్యయో.. తల్లి, పిల్లాడు రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. చివరికి..?!

Whatsapp Image 2024 03 15 At 9.58.16 Am

Whatsapp Image 2024 03 15 At 9.58.16 Am

కొంతమంది వారి తొందరపాటు కారణంగా రైలు ప్రయాణన్ని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరైతే ఎదుటివారిని ప్రమాదంలో నెట్టడం గమనిస్తుంటాము. ఇందుకు సంబంధిచిన వీడియోలు అనేకమార్లు వైరల్ అవ్వడం చేసే ఉంటాము. కాకపోతే కొన్నిమార్లు మాత్రం ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన పిల్లాడితో కలిసి రైలు ఎక్కుతుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది.

also read: Viral: అసలు అలా ఎలా యాక్సిడెంట్ అయ్యిందిరా అయ్యా..?!

సడన్ గా రైలు బోగీ డోర్లు మూసుకుపోవడంతో తల్లి రైలు లోపల, పిల్లాడు రైలు బయట ప్లాట్ ఫామ్ పై ఉండిపోయారు. మహిళ తన పిల్లాడిని వాకర్‌ లో పెట్టుకుని రైల్వే స్టేషన్‌ కి వెళ్తుంది. అక్కడ వాకర్‌ ను తోసుకుంటూనే ప్లాట్‌ ఫామ్ వద్దకు వస్తుంది. కాకపోతే తీరా.. రైలు ఎక్కుతుండగా ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. రైలు బోగీ డోర్లు తెరుచుకోగానే.. ముందుగా తల్లి లోపలికి వెళ్లి.. ఆ తర్వాత పిల్లాడితో పాటూ వాకర్‌ ను కూడా లోపలికి లాక్కునే ప్రయత్నం చేయగా., వాకర్ ముందు చక్రాలు బోగీ తలుపు కింద ఇరుక్కుపోయాయి. ఇలా చూస్తుండగానే రైలు తలుపులు మూసుకుపోతాయి. దీంతో ఆ తల్లి చేసేదేమీలేక ఆమె లోపలే ఉండిపోగా.., పిల్లాడు మాత్రం ప్లాట్‌ ఫామ్‌ లో వాకర్‌ పై ఉండిపోతాడు.

Also read: Droupadi Murmu: నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

అదే సమయలో ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఓ నిరాశ్రయుడు గమనిస్తాడు. దాంతో అతను పైకి లేచి బాలుడి వద్దకు వెళ్లి.. పిల్లాడిని చూసి నవ్వించేందుకు ప్రయత్నిస్తాడు. వాకర్‌ ను ప్లాట్‌ ఫామ్‌ పై అటూ, ఇటూ తిప్పుతూ బాలుడు ముందు కాస్త తమాషాగా ప్రవర్తిస్తాడు. దాంతో ఆ పిల్లాడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు. ఈ వీడియోపై నెటిజన్లు కాస్త రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా కెమెరాతో షూట్ చేశారు.. కావున ఇది నిజం కాదు’’… అంటూ ‘‘ కొందరు అనగా., మరికొందరు మాత్రం “మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఇదే ఉదాహరణ’’.. అని కామెంట్స్ చేస్తున్నారు.