సోషల్ మీడియా పుణ్యమంటూ ప్రతిరోజు మనకి ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని భయభ్రాంతులకు లోను చేస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం భయభ్రాంతులకు లోనవ్వడం జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ALSO READ: Pemmasani Chandrasekhar: ప్రజాగళంలో పెమ్మసాని ప్రభంజనం.. తాడేపల్లి టూ బొప్పూడి వరకు భారీ కటౌట్లు
నీటిలో దిగితే ఎలాంటి జంతువైనా సరే మొసలి తర్వాతే ఏదైనా. నిజానికి ఇవి చాలా క్రూరమైనవి. నీటిలో నివసించే జంతువులను గాని అలాగే ఎవరైనా తెలియక నీటిలో ఉన్న వారినైనా సరే.. అమాంతం చంపితినేయడానికి ప్రయత్నిస్తుంది. అంతకాదు ఒక్కోసారి తమ జాతికి చెందిన చిన్న మొసలిలను కూడా తినేస్తాయి. అసలు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. నీటిలో ఉన్న ఓ చిన్న మొసలిని ఓ పెద్ద మొసలి దాడి చేసి దాన్ని చంపి మింగేందుకు ప్రయత్నం చేస్తుంది.
ALSO READ: S Jaishankar: సీఏఏపై అమెరికా అత్యుత్సాహం.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన జైశంకర్..
ఈ వీడియో లో చూస్తుంటే చిన్న మొసలిని పెద్ద మొసలి వేటాడి తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే చిన్న మొసలిని పెద్ద మొసలి చాలా బలంగా నేలకు వేసి కొట్టింది. దీంతో చిన్న మొసలి ప్రాణాలు కోల్పోయి పెద్ద మొసలికి ఆహారంగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియో మూడు మిలియన్ వ్యూస్ సాధించగా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.
