NTV Telugu Site icon

Karnataka : టెన్త్ స్టూడెంట్ తో ప్రిన్సిపల్ రొమాంటిక్ ఫోటో షూట్.. దుమ్మెత్తిపోస్తున్న జనం

New Project 2023 12 29t123144.619

New Project 2023 12 29t123144.619

Karnataka : ప్రేమకు కులం మతం లేదంటారు. అలాగే వయసు భేదం కూడా ఉండదంటారు. కానీ మనం బతుకుతున్న సమాజంలో కొన్ని విలువలు ఉంటాయి. వాటికి కట్టుబడే మనం మనుగడ సాగించాలి. అలా కాదని విరుద్ధంగా వ్యవహరిస్తే అప్రతిష్ట పాలు కావాల్సి వస్తుంది. సినిమాల ప్రభావమో లేదా సోషల్ మీడియా పైత్యమో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రేమకు అర్థాలు మారిపోయాయి. వావివరుసలు మర్చిపోయి మరీ ప్రేమలో పడిపోతున్నారు. చదువుకోమని పాఠశాలకు పంపితే అక్కడ టీచర్లతో ప్రేమాయణాలు నడుపుతున్నారు. అలా ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ తను చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ తో ప్రేమాయణం కొనసాగించాడు. అంతటి తో ఆగకుండా వారిద్దరూ రొమాంటిక్ యాంగిల్స్ లో ఫోటో షూట్ తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అక్కడ పాఠశాల విద్యార్థి, ప్రిన్సిపల్ వ్యక్తిగత చిత్రాలు వైరల్ కావడంతో కలకలం రేగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో తల్లిదండ్రులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఫిర్యాదు కూడా నమోదైనట్లు సమాచారం.

Read Also:Purandeswari: రాష్ట్రంలో స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది

ఈ పాఠశాల కర్ణాటకలోని మురుగమల్లా గ్రామంలో ఉంది. విద్యా సంబంధిత పర్యటన సందర్భంగా ప్రిన్సిపల్ తన విద్యార్థితో వ్యక్తిగత ఫోటోగ్రాఫ్‌లలో కనిపించినట్లు తెలుస్తోంది. సినిమా సీన్‌లా ఫోటోను క్లిక్‌ చేసేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. చిత్రాల్లో ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడని చెబుతున్నారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత, వారు ప్రధానోపాధ్యాయురాలిని లక్ష్యంగా చేసుకున్నారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధానోపాధ్యాయురాలి తీరుపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బీఈవో పాఠశాలకు చేరుకుని సమాచారం సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలు కొన్ని ఫొటోలు, వీడియోలను తొలగించినట్లు కూడా తేలింది. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయిరాలిని సస్పెండ్ చేశారు. డిసెంబర్ 22 – 25 మధ్య పాఠశాల సిబ్బంది, విద్యార్థులు టూర్ వెళ్లారు. వైరల్‌గా మారిన ఫొటోలను అక్కడే మరో విద్యార్థి క్లిక్‌మనిపించాడు.

Read Also:Challan: పెండింగ్‌ చలాన్లు కట్టేందుకు జనం క్యూ.. కోట్లు కుమ్మరిస్తున్న ఆఫర్

Show comments