సోషల్ మీడియాలో ఈ మధ్య పెళ్లికి సంబందించిన కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి.. నిత్యం ఏదొక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. కొన్ని వీడియోలు చూసేందుకు ఆశ్చర్యంగానూ, మరికొన్ని ఫన్నీగానూ ఉంటుంటాయి.కానీ ఇలాంటి వధువు గురించి ఎప్పుడూ విని ఉండరు..ఎక్కడైనా పెళ్లికి వచ్చే బంధువులు వారికి నచ్చినవి… వారి స్థోమతకు తగ్గట్లు తీసుకొని వస్తారు..అయితే పెళ్లికి వస్తే చిన్నచిన్న బహుమతులు తీసుకురావద్దంటూ అతిథులకు కండిషన్ పెట్టింది ఇక్కడో వధువు. అంతేకాదు..వారు తెచ్చిన గిఫ్ట్ కనీసం రూ.4000ల కంటే తక్కువ కాకుండా ఉండాలంటూ రేటు కూడా ఫిక్స్ చేసి చెప్పింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది..
వధువు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియా రెడ్డిట్‌లో రీట్విట్ చేయటంతో మరింత వైరల్ అవుతోంది. ఇంతకీ వధువు పెట్టిన పోస్ట్‌లో కండీషన్ ఏంటంటే..పెళ్లికి వచ్చే వారికోసం చాలా డబ్బు ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేశామని చెప్పింది. అతిథులు, బంధుమిత్రుల కోసం ఓపెన్ బార్‌లో భోజనం ఏర్పాటు చేశామని, అందుకే ఎవరైనా తన పెళ్లికి ఉట్టి చేతుల్తో వస్తే తనకు చాలా బాధగా ఉంటుందని అందులో రాసింది. అందుకే రూ. 4200లకు తగ్గకుండా బహుమతి ఇవ్వాలని ఆహ్వాన పత్రికతో పాటు రాయించింది..
అయితే ఇదంతా బహుమతికి సంబందించినది కాదు అంటూనే రూ.4200లకు తగ్గకుండా బహుమతి ఇవ్వాలని ఆహ్వాన పత్రికతో పాటు రాయించింది. అయితే, ఇదంతా బహుమతికి సంబంధించిన విషయం కాదని కూడా చెబుతూనే.. బహుమతి అడగడం కూడా చెడ్డ విషయం కాదని రాసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలా బహుమతి కోరే ఆలోచన తప్పు అంటున్నారు చాలా మంది. ప్రేమతో ఇచ్చే బహుమతి వెలకట్టలేనిది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొందరు ఇలానే స్ట్రైట్ గా ఉండాలి అంటూ పొగిడేస్తున్నారు.. మొత్తానికి ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..