NTV Telugu Site icon

క్రేజ్ అంటే ఇదేరా… మార్కెట్‌లో జగన్ ఆటం బాంబులు

రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా బిజినెస్ రంగంలో అయినా క్రేజ్‌ను క్యాష్ చేసుకోని వారు ఉండరు. క్రేజ్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వేనకేసుకోవాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. వైసీపీ ఏ ఎన్నికలో పోటీ చేసినా ప్రజలు ఘనవిజయాన్ని కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ క్రేజ్‌ను పలు కంపెనీలు వాడుకుంటున్నాయి.

Read Also: వైరల్ వీడియో: వ్యక్తి ప్రాణం తీసిన రోడ్డుపై గుంత

దీపావళి సందర్భంగా పలు రకాల బాణసంచా మార్కెట్లో సందడి చేస్తోంది. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, మతాబులు, రాకెట్లు, వంకాయ బాంబులు వంటివి ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఏపీలో ఈ సారి కొత్తగా జగన్ ఆటం బాంబులు కనువిందు చేస్తున్నాయి. సీఎం జగన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుని తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని తయారీదారులు ఇలా ప్రయత్నించారు. అయితే జగన్ పేరుతో విక్రయిస్తున్న ఈ బాంబులు ఏ ప్రాంతంలో విక్రయిస్తున్నారో తెలియకున్నా… ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.