ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ సంస్థలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ఇక కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అనేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు.. అయితే కొన్నిసార్లు కస్టమర్లకు అనుకోని అతిధులు కూడా వస్తుంటాయి.. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి షాక్ అయ్యాడు.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు లోని ఓ వ్యక్తి ఎంతో ఆశగా ఆన్లైన్లో చికెన్ షవర్మా ను ఆర్డర్ చేశాడు.. స్విగ్గీ నుంచి అది రాగానే ఎంతో ఆత్రుతగా దాన్ని తిందామని ఓపెన్ చేసి సగం తిన్నాడు. పార్సిల్‌లో అతనికి వచ్చిన వస్తువు చూసి అతడు కంగుతిన్నాడు..తాను పెట్టిన ఆర్డర్ ప్రకారం షావర్మాకు బదులుగా అందులో చిన్న ఇనుప ముక్క వచ్చింది. అతను దాన్ని ఫోటో తీసి షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది..
షావర్మా ను తింటున్న క్రమంలో అతనికి ఏదో గట్టిగా తగిలింది.. దాన్ని బయటకు తీసి చూస్తే అది ఒక ఇనుప ముక్క రావడం చూసి షాక్ అయ్యాడు.. దీనిపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి కి కంప్లైంట్ ఇచ్చాడు.. ఇక సపోర్ట్ ఏజెంట్ వీటన్నింటిపై అస్సలు శ్రద్ధ చూపడం లేదని అతడు ఆరోపించాడు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి స్వయంగా పరిశీలిస్తారా? లేదా? అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది.. అయితే ఈ పోస్ట్ 2024 జనవరి 11 న షేర్ చేయగా, ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ విషయంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా కొందరు సలహాలు ఇచ్చారు.. మొత్తానికి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..
