Roelof van der Merwe takes a brilliant catch to dismiss Moeen Ali in The Hundred: క్రికెట్ ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుత క్యాచ్‌లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకోవడం, ఒంటిచేత్తో బంతిని పట్టడం లాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసే ఉంటాం. అయితే తాజాగా అంతకు మించిన ఫీల్డింగ్ నమోదైంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నీలో ఓ ప్లేయర్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
హండ్రెడ్ టోర్నీలో భాగంగా బర్మింగ్‌హాం ఫోనిక్స్, వెల్ష్ ఫైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్ జట్టు ఆటగాడు వాన్ డర్ మెర్వ్ సూపర్ ఫీల్డింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఫోనిక్స్ టీం స్టార్ మొయీన్ అలీని అవుట్ చేయడానికి వాన్ డర్ మెర్వ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ డేవిడ్ పేన్ వేసిన బంతిని అలీ భారీ షాట్ ఆడాడు. బ్యాటుకు సరిగ్గా కనెక్ట్ కాని బంతి.. లాంగాన్ దిశలో పైకి లేచింది.
Also Read: Simran Kaur Images: హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న సిమ్రాన్ కౌర్.. కారులో అలా..!
అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డర్ మెర్వ్ వేగంగా పరిగెత్తుకొచ్చి.. క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బాగా ఎత్తుకు వెళ్లిన బంతి అతడి చేతుల్లో పడి బయటకు వచ్చేసింది. వాన్ డర్ మెర్వ్ ఛాతీపై పడిన బంతి మైదానంలో పడపోయింది. ఈ సమయంలో డైవ్ చేసిన అతడు బంతి నేలకు తాకకముందే ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దాంతో అలీ పెవిలియన్ చేరక తప్పలేదు. దాంతో వెల్ష్ ఫైర్ జట్టు సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనికి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. అరె.. ఏంట్రా ఆ క్యాచ్, మస్త్ పట్టినవ్ పో అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ మ్యాచులో వెల్ష్ ఫైర్ జట్టు విజయం సాధించింది.
Not a conventional way to take a catch, but Roelof van der Merwe and Welsh Fire won't mind! 🤣#TheHundred pic.twitter.com/58hfm2PyzH
— The Hundred (@thehundred) August 10, 2023