Viral Video: సోషల్ మీడియాలో ఓ నవజాత శిశువుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులో పిల్లాడికి పెద్ద మీసాల్లా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఈక్వెడార్‌కు చెందినదిగా సోషల్ మీడియా పోస్టుల్లో వైరల్ అవుతుంది. దీంతో బిడ్డ పుట్టుకతోనే ఇంత మీసాలతో ఎలా పుట్టాడంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం.. కొందరు పిల్లలు పుట్టినప్పుడు శరీరంపై సన్నని, మృదువైన వెంట్రుకలతో ఉంటారు. వీటిని లానుగో (Lanugo) అంటారు. ఇవి గర్భంలోనే ఏర్పడి, సాధారణంగా పుట్టిన తర్వాత క్రమంగా రాలిపోతాయి. శిశువు వీపు, భుజాలు, చెవులు, ముఖంపై కూడా ఇవి కనిపించవచ్చు.
అయితే లానుగో వెంట్రుకలు సాధారణంగా చాలా పలుచగా, లేతగా ఉంటాయి. వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్టుగా స్పష్టమైన ఆకారంలో దట్టమైన నల్లటి మీసాల్లా ఉండటం సాధారణం కాదు. అంతేకాకుండా ఈ వీడియోను నిజమైన వైద్య కేసుగా నిర్ధారించే ఆసుపత్రి రికార్డు, వైద్యుల ప్రకటన లేదా కుటుంబ వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో ఈ వీడియోలో కనిపిస్తున్న మీసాలు డిజిటల్ ఎడిటింగ్ లేదా ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డ ముఖం కదులుతున్నప్పుడు మీసాల చుట్టూ స్వల్పంగా గ్లిచ్‌లా కనిపించడం, వెంట్రుకలపై వెలుతురు ముఖంపై పడుతున్న కాంతితో సరిపోలకపోవడం వంటి అంశాలను ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇందులో కొందరు పుట్టగానే పిల్లడు అంకుల్ అయిపోయాడంటూ కామెంట్ చేయగా, మరికొందరు బిడ్డ ఫొటోలను ఎడిట్ చేసి వఱకు నచ్చిన వివిధ రూపాల్లో మీమ్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ వీడియో పూర్తిగా నిజమని లేదా పూర్తిగా నకిలీదని నిర్ధారించే ఆధారం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాన్ని నిజమైన మెడికల్ మిరాకల్ అని భావించలేము.
🚨#VIRAL BABY BORN WITH MOUSTACHE 🇪🇨
A newborn in Ecuador has taken the internet by surprise with a striking dark patch of hair above the lip. https://t.co/G5ikJHkNC5
— Silent Observer (@YousufPash69914) October 24, 2026

