Site icon NTV Telugu

Vinod Thomas: ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన మలయాళ నటుడు.. ఏసీనే ప్రాణం తీసిందా?

Vinod Thomos

Vinod Thomos

ప్రముఖ మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానస్పదంగా మృతి చెందారు.. ఈ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. కేరలోని కొట్టాయం పంపాడి సమీపంలోని ఓ హోటల్‌లో పార్క్ చేసిన వాహనంలో శవమై కనిపించడం సంచలనం రేపింది. హోటల్ యాజమాన్యం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అతని మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.. ఆయన మృతదేహన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు..

ఇకపోతే వినోద్ థామస్ కనిపించిన కారులో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నుండి విషపూరితమైన పొగలు వస్తున్నట్లు గుర్తించారు. వాటి కారణంగా అతను చనిపోయి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేవరకు ఎటువంటి వివరణకు రాలేకున్నారు..

వినోద్ థామస్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ‘నాతోలి ఒరు చెరియా మీనల్లా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒరు మురై వంత్ పథాయ, హ్యాపీ వెడ్డింగ్, జూన్ వంటి సినిమాల నటనకు మరింత పేరు వచ్చింది. ప్రస్తుతం ఆయన రేవతి ఎస్.వర్మ డైరెక్షన్‌లో ‘ఈ వాలయం’ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా విడుదల కాకముందే ఆయన మృతి చెందడం పై ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకున్నారు.. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..

Exit mobile version