Vinod Kambli: ఇదివరకు తన బ్యాటింగ్ లో సిక్సర్లు, ఫోర్లను అవలోకగా బాదిన వినోద్ కాంబ్లీ నేడు చాలా ఊహించలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీ నేడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే ఆయన వినోద్ కాంబ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. అదికూడా తనకు తానుగా నడవలేకపోతుండడం గమనించవచ్చు. వ్యక్తులు ఆసరా అందించడంతో అడుగులు కూడా వేయలేని దయనీయ పరిస్థుతులలో మిగిలి పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.
Beetroot Juice: బాడీ ఫిట్ గా ఉండాలంటే తప్పక తాగాల్సిందే..
అయితే వినోద్ కాంబ్లీకి అసలేమీ జరిగిందనే దానిపై ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే., మీడియా నివేదికల ప్రకారం.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆరోగ్యం చాలా కాలంగా సరిగాలేదు. అయన అనేకమార్లు ఆసుపత్రిలో చేరాడు. ఆయన గుండెపోటుకు గురవ్వడమే కాకుండా.., డిప్రెషన్ తో కూడా ఇబ్బంది పడుతున్నాడు. కొంతకాలం క్రితం ఆయన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు.. స్నేహితుడు సచిన్ సహాయం చేశాడు. అంతేకాదు ఆయన్ను సచిన్ అతన్ని అకాడమీలో కోచ్ గా నియమించాడు కూడా. అంతే కాదు ముంబై టీ20 లీగ్‌లో జట్టుకు కోచ్ గా కూడా ఆయన ఉన్నారు. కానీ.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో అతను కోచ్‌గా ఉద్యోగం కోల్పోయాడు.
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా.?
ఇకపోతే వినోద్ కాంబ్లీ టీమిండియా తరఫున 17 టెస్టు మ్యాచ్‌లు, 104 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ క్రికెట్‌లో 54.20 సగటుతో 1084 పరుగులు చేయగా., ODI లలో కూడా 32 కంటే ఎక్కువ సగటుతో 2477 పరుగులు చేశాడు. ఇకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కాంబ్లీ 9965 పరుగులు చేశాడు. అతని సగటు సగటు 60.
It's really sad what ALCOHOL can do to you. This is former Indian cricketer Vinod Kambli’s state as he's escorted off his two wheeler by onlookers to safety. 🥃☠️❌ pic.twitter.com/ibBUlDOT3k
— PRASHANT KESHWAIN 🏏 (@pkeshwain) August 5, 2024