హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ విజయం సాధించారు. వినేష్ ఫోగట్ 6015 ఓట్లతో గెలుపొందారు. వినేష్‌కి మొత్తం 65080 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి యోగేష్ కుమార్‌కు 59065 ఓట్లు వచ్చాయి. తన విజయంపై వినేష్ ఫోగట్ మొదటిసారి స్పందించింది. ‘ఇది ఎల్లప్పుడూ పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి, మహిళ యొక్క పోరాటం. ఈ దేశం నాకిచ్చిన ప్రేమను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. అన్ని సీట్ల ఫలితాలు ఇంకా స్పష్టంగా తెలిసేంత వరకు వేచి ఉండండి. ఇంకా ఏమీ క్లారిటీ లేదు.. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’. అని తెలిపారు.
Read Also: Minister Nadendla Manohar: సమాజం కోసం, దేశం కోసం.. పవన్ కల్యాణ్ నిర్ణయాలు
వినేష్ ఫోగట్ విజయంపై WFI మాజీ అధ్యక్షుడు, బిజెపి నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ, ‘ఆమె (వినీష్ ఫోగట్) మా పేరును ఉపయోగించుకొని గెలిస్తే, దాని అర్థం మనం గొప్ప వ్యక్తులం. నా పేరుకు అంత శక్తి ఉంది, నా పేరుతో గెలవడం ద్వారా ఆమె పడవ దాటింది కానీ కాంగ్రెస్ మునిగిపోయింది.’ అని విమర్శించారు. అంతకుముందు వినేష్ విజయంపై బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ఆమె విజయానికి భారతదేశ బిడ్డ వినేష్ ఫోగట్‌కు చాలా అభినందనలు. ఈ పోరు కేవలం ఒక్క జులనా సీటు కోసమే కాదు.. పార్టీల మధ్య కాదు. ఈ పోరాటం దేశంలోని బలమైన అణచివేత శక్తులకు వ్యతిరేకంగా జరిగింది. ఇందులో వినేష్ విజేతగా నిలిచిందని’. అని తెలిపాడు.
Read Also: Tulsi Kumar: షూటింగ్‌లో ఘోర ప్రమాదం: వెంట్రుక వాసిలో తప్పించుకున్న నటి.. వీడియో వైరల్