NTV Telugu Site icon

Brand Value: కంపెనీల క్యూ.. ఒక్కసారిగా పెరిగిన వినేశ్‌, మను బాకర్‌ సంపాదన!

Vinesh Phogat Manu Bhaker

Vinesh Phogat Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ అనూహ్య రీతిలో పతకానికి దూరమైన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో ఫైనల్ బౌట్‌కు ముందు 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అయితే పతకం కోల్పోయినా ఆమెకు దేశవ్యాప్తంగా ఎంతో మద్దతు లభించింది. స్వదేశానికి వచ్చినపుడు అపూర్వ స్వాగతం దక్కింది. ఇప్పుడు వినేశ్‌ బ్రాండ్‌ విలువ కూడా ఒక్కసారిగా పెరిగింది.

పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత వినేశ్‌ ఫొగాట్‌ పారితోషకం నాలుగు రెట్లు పెరిగిందట. ఒక్కో ప్రకటనకు గతంలో రూ.25 లక్షలు పారితోషకం తీసుకున్న వినేశ్‌కు ఇప్పుడు ఏకంగా రూ.కోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన యువ షూటర్‌ మను బాకర్‌ బ్రాండ్‌ విలువ కూడా భారీగా పెరిగింది. గతంలో ఒక్కో ప్రకటనకు రూ.25 లక్షలు తీసుకున్న మను పారితోషకం రూ.1.5 కోట్లకు చేరుకుందట. ఈ ఇద్దరి కోసం పలు కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది.

Also Read: Rohit Sharma: ఆ ముగ్గురి మద్దతుతో ప్రపంచకప్‌ గెలిచాం: రోహిత్

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించి బ్రాండ్ల ఫేవరెట్‌గా మారిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతానికే పరిమితం అయ్యాడు. అయినప్పటికీ నీరజ్‌ పారితోషకం 30 శాతానికి పైగా పెరిగినట్లు తెలుస్తోంది. క్రికెటర్స్ తర్వాత ఈ ముగ్గురు చాలా ప్రకటనలు చేస్తున్నారు.