ఇండస్ట్రీ ఏదైనప్పటికి కాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది. ప్రతి ఒక్క హీరోయిన్ .. మిగతా నటీనటులు కచ్చితంగా ఒక్కరితో అయిన ఇబ్బందులు ఎదురుకుని ఉంటారు. కానీ ఇలాంటి విషయాలు ఒక్కప్పుడు చాలా గోప్యంగా ఉంచేవారు. ఇప్పుడు మాత్రం అలా కాదు చాలా మంది సెలబ్రిటీలు తమకు సినిమాల్లో ఛాన్సుల కోసం కమిట్ మెంట్ అడిగారని.. హీరోలు, నిర్మాతలతో బెడ్ షేర్ చేసుకుంటేనే సినిమాలో అవకాశాలు ఇస్తామనరాని.. ఇలా వారికి జరిగిన అన్యాయాన్ని ఎలాంటి బెరుకు లేకుండా బయటపెట్టారు. ఈ క్రమంలో తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ తనకు గతంలో కలిగిన ఒక షాకింగ్ అనుభవం పై ఏకంగా ఒక వీడియోను రిలీజ్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Baahubali 1 : ప్రపంచ యాత్రలో మరో ఘట్టానికి చేరుకున్న ‘బాహుబలి’
ఇందులో భాగంగా తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక హీరో నన్ను షూటింగ్ సమయంలో డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంటే, తన ముందు మార్చుకోవాలని ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా.. ఆ సమయంలో అతను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడు. ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులు ఆగడం లేదు. చాలా మంది ఫిమేల్ ఆర్టిస్ట్‌లు ఎదో ఓ సమయంలో కాస్టింగ్ కౌచ్ కు గురవుతున్నారు. అసలు.. ఇప్పటికి కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుని నీచంగా ప్రవర్తిస్తున్నారు. నాకు ఎదురైన వేధింపుల ఘటన అందరికీ తెలిసిన కూడా.. దీనిపై ఎవరూ మాట్లాడలేదు. అందుకే ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్పాలనుకుంటున్న మనల్ని మనమే కాపాడుకోవాలి ఎవ్వరిని నమ్మడానికి లేదు’ అంటూ విన్సీ సోనీ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
